పెద్దిరెడ్డి అడ్డాలో ఎంపీడీవో నిధులు స్వాహా, చంద్రబాబు ఊరికే వదలుతారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జడ్పీలో జరిగిన గోల్ మాల్ వ్యవహారాల గురించి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అవకతవకల గురించి పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ గురించి పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి.
కేసు దర్యాప్తు నీరుగార్చేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ప్రజల సొమ్ము, జడ్పీ నిధులు తినేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని, కేసు దర్యాప్తు మాత్రం ముందుకు సాగడంలేదని ఆరోపణలు ఉన్నాయి. పుంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ నిధులను కొందరు అధికారులు మింగేశారు. ఎంపీడీవో కార్యాలయంలో సుమారు రూ. 1.30 కోట్లు దుర్వినియోగం చేశారని పోలీసులు దర్యాప్తులో వెలుగుచూసింది.

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులపై ఇప్పటికే వేటు పడింది. పుంగనూరు ఎంపీడీవో, ప్రస్తుత ఏవో రాజేశ్వరి, సీనియర్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి, పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న సునీల్ ని ఇప్పటికే సస్పెండ్ చేశారు. మరో అధికారి నారాయణను తాత్కాలికంగా తొలగించారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలతో నారాయణపై చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల అండతోనే పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. మేమంతా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనుషులు అంటూ పై అధికారులకు చెప్పిన పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తరువాత రాష్ట్ర స్థాయి అధికారులను బెదిరించి ఇష్టానుసారంగా నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సొమ్ము నొక్కేసిన ఉద్యోగులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసు దర్యాప్తును ఎందుకు పట్టించుకోవడం లేదని జడ్పీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే పోలీసులు అడిగిన అన్ని ఫైళ్లను ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఇచ్చారు. ఫైళ్లు చేతిలో ఉన్నా కూడా పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేయలేదని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులందరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పినట్లు చేశారని, ఇప్పుడు పోలీసులు సైతం ఈ కేసు దర్యాప్తును సక్రమంగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
కొందరు ఉద్యోగులు పోలీసులు మీద ఒత్తిడి తీసుకువచ్చి కేసు దర్యాప్తు వేగవంతం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం నిధుల స్వాహా కేసు విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని స్థానికులు అంటున్నారు. పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో పని చేసే కొందరు ఉద్యోగులు మాత్రం దెబ్బకు హడలిపోతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications