బీజేపీ అన్యాయం చేయదు, టీడీపీ ఎంటో తెలుసు: పురంధేశ్వరి, ‘పట్టిసీమపై సీబీఐకి లేఖ’
అమరావతి: భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదని ఆ పార్టీ నేత పురంధేశ్వరి అన్నారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో తామిచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ఏపీలో బీజేపీపై తెలుగుదేశం పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన పురంధేశ్వరి.. ఎవరెంటో ప్రజలకు తెలుసునని అన్నారు. ఏపీలో భూగర్భ డ్రైనేజీకి ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.

పట్టిసీమపై సీబీఐకి లేఖ రాస్తా: విష్ణు
పట్టిసీమ ప్రాజెక్టులో అనీతి జరిగిందని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు.
తాము అఖిలపక్ష సమావేశానికి రాలేకపోవడంపై విష్ణు కుమార్ రాజు శనివారం చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ఆ లేఖలో పట్టిసీమ అంశాన్ని కూడా లేవనెత్తినట్లు చెప్పారు. చంద్రబాబు స్పందించని పక్షంలో తాము సీబీఐ విచారణకు లేఖ రాసే అంశాన్ని ఆలోచిస్తామని విష్ణు కుమార్ రాజు తెలిపారు. కాగా, శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications