ఒకే కోణమా?: పురంధేశ్వరి ఆగ్రహం, వర్మ కౌంటర్, సినిమాను ఎవరైనా ఆపగలరా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై పురంధేశ్వరి స్పందించారు. ఆయన సినిమాపై ఓ విధంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్: లోకేష్-బాలకృష్ణపై రివేంజా? 'బాలకృష్ణ ఒత్తిడి చేసినా నో'

 లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి, ఆయన మృతి వరకు సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తీసే ఈ సినిమా ఎవరిని టార్గెట్ చేసుకుంటారో తెలిసిపోతుందని అంటున్నారు.

 పురంధేశ్వరి స్పందన

పురంధేశ్వరి స్పందన

ఇదే అంశంపై పురంధేశ్వరి కూడా స్పందించారు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని ఆమె అన్నారు. ఆయన జీవితంపై సినిమా తీస్తే గౌరవాన్ని పెంచేలా ఉండాలన్నారు. కానీ ఒక్క కోణంలో (లక్ష్మీపార్వతి జీవితంలోకి వచ్చే అంశంపై) సినిమా తీయాలనుకోవడం సరికాదన్నారు.

 ఒకే కోణంలో సరికాదు

ఒకే కోణంలో సరికాదు

ఒకవేళ సినిమా తీయాలనుకుంటే నిర్మాణాత్మకంగా ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని విషయాలను చూపించే ప్రయత్నం చేయాలని పురంధేశ్వరి అన్నారు. అంతే తప్ప ఒక కోణంలో సినిమాను చూపించడం సరికాదన్నారు.

 పరోక్షంగా వర్మ కౌంటర్

పరోక్షంగా వర్మ కౌంటర్

దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీయాలంటే మహాభారతంలా 18 భాగాల కంటే ఎక్కువ అవుతుందని, ఆయన సినిమాను రెండున్నర గంటల్లో చూపించలేమని, అందుకే తాను ఒక్క కోణాన్ని తీసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా ఎన్టీఆర్ గౌరవానికి భంగం వాటిల్లేలా తన సినిమా ఉండదని చెప్పారు.

 సినిమాను ఆపుతారా?

సినిమాను ఆపుతారా?

ఒక్క కోణంలో ఎన్టీఆర్ సినిమాను తీయవద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో వర్మ సినిమాను నందమూరి, నారా కుటుంబాలు మరెవరైనా ఆపగలరా అనే చర్చ సాగుతోంది. కానీ వర్మ మాత్రం కచ్చితంగా సినిమాను తీయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
purandeswari asks rgv not to confine his biopic on ntr to one angle of his life bu to cover all aspects.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి