మోసం: కాంగ్రెస్‌పై పురంధేశ్వరి, జతకల్సిన కృష్ణం రాజు
శ్రీకాకుళం: కాంగ్రెసు పార్టీ పైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, మరో సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజులు బుధవారం నిప్పులు చెరిగారు. పురంధేశ్వరి, కృష్ణం రాజులు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
సీమాంధ్రకు బిజెపితోనే న్యాయం జరుగుతుందని పురంధేశ్వరి చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఢిల్లీ పీఠం ఎక్కాలన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెసు తీరని అన్యాయం చేసిందని, మోసం చేసిందని, బిజెపి పట్టుబట్టడం వల్లనే ఉత్తరాంధ్రకు ప్యాకేజీ వచ్చిందని చెప్పారు.

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఆంధ్రా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బిజెపి గెలవాలని, మోడీ ప్రధాని కావాలన్నారు.
మోడీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కృష్ణం రాజు చెప్పారు. కాంగ్రెసు పార్టీ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. పదేళ్ల కాంగ్రెసు పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications