కోల్డ్ వార్.. బాబుకు 'లక్షకోట్ల' చిక్కులు, అబద్దాలొద్దు: బీజేపీ

: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెబుతున్నారని, అయితే అంతకు మించి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం నాడు అన్నారు. ఏపీకి హోదా రాదని ఆమె తేల్చి చెప్పారు.

14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదన్నారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామని కేంద్రం చెబుతోందన్నారు. ఇప్పటికే పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం బీజేపీ చిత్తశుద్ధితో పని చేసిందని, ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారన్నారు.

ప్రతి రూపాయి కూడా కేంద్రం ఇస్తుందని బీజేపీ హరిబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పడం సరికాదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు డబ్బులను కూడా పోలవరం ప్రాజెక్టులో కలిపేశారని, అది సరికాదని హరిబాబు చెప్పారు. ఆలస్యమైనా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.

Purandeswari and Haribabu respond on Special Status for AP

టెక్నికల్‌గా ఇవ్వాలని లేకున్నప్పటికీ కేంద్రం నుంచి 30 శాతం అదనంగా నిధులు వస్తున్నాయని చెప్పారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని చెప్పారు. తినగ తినగ వేప తీయన అన్నట్లుగా... నిధుల విషయంలో టిడిపి అవాస్తవాలు చెబుతోందన్నారు.

వారు తెలిసిన మాట్లాడారో, తెలియక మాట్లాడారో.. అన్నీ వారికి చెబుతామన్నారు. ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని చెప్పారు. టిడిపి నేతలు అవాస్తవాలు చెప్పడం విడ్డూరమన్నారు.

రూ.1లక్షా 40వేల కోట్లు ఇచ్చాం: విష్ణు

ఏపీకి హోదా ఇవ్వకున్నా ఇవ్వాల్సిన అన్నింటిని ఇస్తున్నామని విష్ణు కుమార్ రాజు అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రూ.1.40 లక్షల కోట్లు వచ్చాయన్నారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రజలకు సమాచారం లేక అవగాహన లోపం ఏర్పడిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపమని ఇప్పటికే అనేకమార్లు ప్రభత్వామన్ని కోరామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+