వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ ఢిల్లీకి ఎందుకు? రాహుల్ తహతహ..: పురంధేశ్వరి ఫైర్, ‘జోన్‌’పై హరిబాబు కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

బాబూ ఢిల్లీకి ఎందుకు? రాహుల్ తహతహ : పురంధేశ్వరి ఫైర్

హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేత పురంధేశ్వరి, ఎంపీ హరిబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు వేదికగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చట్టంలో లేని హామీలను కూడా కేంద్రం నెరవేరుస్తోందని చెప్పారు.

బాబూ ఢిల్లీకి ఎందుకు?

బాబూ ఢిల్లీకి ఎందుకు?

అవిశ్వాసానికి మద్దతు పలికిన పార్టీలకు ధన్యవాదాలు చెప్పేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదమని పురంధేశ్వరి అన్నారు. ఏపీకి ఏ ఒక్క పార్టీ కూడా మద్దతుగా మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు ఎవరికి ధన్యవాదులు చెబుతారని పురంధేశ్వరి ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఏపీ గురించి అర నిమిషం కూడా మాట్లాడలేదని అన్నారు. వారికి చంద్రబాబు ధన్యవాదాలు చెప్పడమేంటని ప్రశ్నించారు.

బీజేపీకి అవినీతిని అంటగట్టాలని రాహుల్..

బీజేపీకి అవినీతిని అంటగట్టాలని రాహుల్..

పార్లమెంటులో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ.. బీజేపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని పురంధేశ్వరి మండిపడ్డారు. బీజేపీకి అవినీతి అంటగట్టాలని రాహుల్ గాంధీ తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు.

 మళ్లీ మోడీనే ప్రధాని

మళ్లీ మోడీనే ప్రధాని


2019లో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని, ప్రజలు మళ్లీ నరేంద్ర మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పురంధేశ్వరి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా భారత్‌పై ఉన్న గౌరవం మరింత పెరిగిందని చెప్పారు. మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మోడీనే 2019లోనూ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పురంధేశ్వరి తెలిపారు.

టీడీపీ, వైసీపీలతో పొత్తు లేదు..

టీడీపీ, వైసీపీలతో పొత్తు లేదు..

టీడీపీ.. వైసీపీతో బీజేపీ అంటకాగుతుందంటే.. వైసీపీ.. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందంటూ ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటిలో వాస్తవం లేదని అన్నారు. టీడీపీతో గానీ, వైసీపీతోగానీ ఎలాంటి రాజకీయ పొత్తులు లేవని, 2019 ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే చెప్పారని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

నేను ఎంపీగా ఉండగానే రైల్వే జోన్

నేను ఎంపీగా ఉండగానే రైల్వే జోన్

తాను ఎంపిగా ఉండగానే ఎపికి రైల్వేజోన్‌ వస్తుందని బీజేపీ ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎంత న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువ చేస్తామని మరోసారి చెప్పుకొచ్చారు. ఏపీని ఆదుకోవడానికి చట్టంలో లేనివి కూడా కేంద్రం చేసిందన్నారు. విభజన చట్టం ప్రకారం హామీ ఇచ్చిన 11 సంస్థల్లో ఇప్పటికే 10 మంజూరు చేశామని హరిబాబు స్పష్టం చేశారు.

English summary
BJP leaders Purandeswari, Kambhampati Hari Babu on Saturday fired at TDP and Congress for blaming BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X