ఆయనిష్టం! పవన్ కళ్యాణ్ కోర్టులోకి నెట్టిన పురంధేశ్వరి, బాబుకు షాకిచ్చేలా..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు కోసం టిడిపి, వైసిపి, జనసేనలు ఉవ్వీళ్లూరుతున్నాయి. జనసేన మాత్రం తన పంథాలో వెళ్తోంది. ఎన్నికల్లో పోటీపై దూకుడుగా వ్యవహరించడం లేదు.
Recommended Video

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు కోసం టిడిపి, వైసిపి, జనసేనలు ఉవ్వీళ్లూరుతున్నాయి. జనసేన మాత్రం తన పంథాలో వెళ్తోంది. ఎన్నికల్లో పోటీపై దూకుడుగా వ్యవహరించడం లేదు.
పార్టీని మాత్రం బలోపేతం చేస్తున్నారు. త్వరలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి మహిళా నాయకురాలు పురంధేశ్వరి పొత్తుపై స్పందించారు. ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు.

మేం సిద్ధమే, నిర్ణయం పవన్ కళ్యాణ్‌దే
వచ్చే ఎన్నికల్లో జనసేన, బిజెపి కలసి పోటీ చేసే విషయమై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడేనని ఆమె చెప్పారు. పొత్తుకు తామెప్పుడు సిద్ధంగానే ఉంటామని, ఎవరితో కలసి వెళ్లాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణేనని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం సరికాదు
పవన్ కళ్యాణ్ వైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తే పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని పురంధేశ్వరి తెలిపారు. రెండు పాచిపోయిన లడ్డూలను కేంద్రం ఏపీ ప్రజల చేతుల్లో పెట్టిందని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

చంద్రబాబుకు షాకిచ్చేలా
ప్రత్యేక హోదా సమసిపోయిన అంశమని, అంతకు మించిన లాభాన్ని రాష్ట్రం ఇప్పుడు ప్యాకేజీ రూపంలో అందుకుంటోందని పురంధేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకుండా కేంద్రానికే అప్పగిస్తే మరింత త్వరగా పనులు పూర్తి అయ్యేవన్నారు. తదుపరి ఎన్నికల్లోగా పోలవరం స్పిల్ వే, కాఫర్ డ్యామ్ తదితరాల నిర్మాణం పూర్తవుతుందని భావించడం లేదని చంద్రబాబుకు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది
జీఎస్టీ, నోట్ల రద్దు వంటి సంస్కరణల తర్వాత ప్రజలకు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో పార్టీ జాతీయ నాయకత్వం పడిపోయిందని వస్తున్న విమర్శలను పురందేశ్వరి కొట్టి పారేశారు. ఆ పరిస్థితి వచ్చిందని తాను అనుకోవడం లేదని, అయితే, కొన్ని విషయాలపై ప్రజలకు విడమరచి చెప్పాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు.

దక్షిణాదిలో అధికారంలోకి వస్తాం
ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మోడీ నిర్ణయాలు తీసుకోవడం లేదని పురంధేశ్వరి చెప్పారు. దేశాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కొన్ని కీలక నిర్ణయాల వల్ల స్వల్పకాల నష్టాలు ఉంటాయని, అవి దీర్ఘకాలంలో అభివృద్ధికి సోపానాలుగా మారుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో దక్షిణాదిలో బిజెపి మంచి ఫలితాలు సాధిస్తుందని, కర్ణాటకలో అధికారంలోకి వస్తామని, ఏపీలో, కేరళలో మరింత బలపడతామన్నారు.












Click it and Unblock the Notifications