నాకు పదవీకాంక్ష లేదు, టిడిపికి థ్యాంక్స్: పురంధేశ్వరి

చిత్తూరు/హైదరాబాద్: తనకు పదవీ కాంక్ష లేదని, ప్రజాసేవకు గెలుపోటములతో పని లేదని కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం అన్నారు. రాజాంపేట పరిధిలోని ఏడు నియోజకవర్గాల నేతలతో పురందేశ్వరీ ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాజాంపేట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజాసేవకు గెలుపోటములతో పని లేదని చెప్పారు. పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

 Purandeswari review meeting in Rajampet

ప్రజాతీర్పు శిరోధార్యమని, అధిష్టానం నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానని చెప్పారు. రాజంపేటలో తనకు సహకరించిన బిజెపి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పురందేశ్వరీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరీ రాజంపేట లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన మిథున్ రెడ్డి గెలుపొందారు.

రుణమాఫీపై పోచారం వివరణ

రైతుల రుణమాఫీ కాలపరిమితి పైన ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. బ్యాంకర్ల నుంచి సమాచారమే మాత్రమే కోరామన్నారు. విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. ఖరీఫ్ పంటలకు 8 గంటల విద్యుత్ సరఫరా అందిస్తామని, మూడేళ్లలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+