Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాలే వద్దనుకున్నా, కానీ భర్త...: పురందేశ్వరి

హైదరాబాద్: తాను రాజకీయాల నుంచే తప్పుకుందామని అనుకున్నానని, అయితే తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, మిత్రులు, శ్రేయోభిలాషులు చెప్పడంతో కొనసాగాలని అనుకున్నానని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. బిజెపిలో చేరిన తర్వాత ఆమె శుక్రవారం సాయంత్రం ఎం. వెంకయ్యనాయుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చావు, ఇప్పుడే తప్పుకోవడం ఎందుకని దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుటుంబసభ్యులు మిత్రులు, శ్రేయోభిలాషులు చెప్పారని ఆమె అన్నారు. రాజకీయాల్లో కొనసాగాలని పట్టుబట్టారని ఆమె చెప్పారు.

కాంగ్రెసుకు రాజీనామా చేసిన తర్వాత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించినప్పుడు జాతీయ పార్టీలో ఉంటే తన ప్రజలకు న్యాయం చేయగలుగుతానని అనిపించిందని, అందుకే బిజెపిని ఎన్నుకున్నానని ఆమె చెప్పారు. విభజన విషయంలో తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉందామని అనుకున్నానని, అయితే సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరామని, అది కూడా చేయలేదని ఆమె అన్నారు. లోకసభలో ప్రవేశపెట్టిన బిల్లులో సీమాంధ్రకు ప్ర్తత్యేక హోదా గానీ పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడం గానీ లేవని, అప్పుడే తాను తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించానని ఆమె వివరించారు.

Purandeswari says she thought of withdrawal from politics

ఎంతో బాధతో తాను రాజీనామా లేఖ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. బిజెపి నేతలు తనను బాగా ఆదరించారని ఆమె చెప్పారు. తన తండ్రి ఎన్టీ రామారావు వల్ల కావచ్చు, తన పనితీరును చూసి కావచ్చు వారు తనను ఆదరించారని పురంధేశ్వరి చెప్పారు. తాను బేషరతుగా బిజెపిలో చేరినట్లు ఆమె తెలిపారు. పార్టీ దిశానిర్దేశానికి అనుగుణంగా నడుచుకుంటానని ఆమె చెప్పారు. బిజెపిలో చేరి సీమాంధ్రకు న్యాయం చేయగలనని అనుకుంటున్నట్లు తెలిపారు.

వెనక్కి తిరిగి చూసుకోవడం విలువైన సమయాన్ని వృధా చేయడమేనని వెంకయ్య నాయుడు అన్నారు. తాము పట్టుబట్టిన తర్వాతనే సీమాంధ్రకు ఆ మాత్రం రాయితీలైనా ఇచ్చారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగే విశ్వసనీయత, సమర్థత నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+