తప్పు మాపైకి నెడుతారా, మీరే చెప్పారుగా: బాబును దులిపేసిన పురంధేశ్వరి

Posted By:
Subscribe to Oneindia Telugu
  Purandeshwari Rises Her Voice బాబును దులిపేసిన పురంధేశ్వరి

  అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కేంద్రమంత్రి పదవులకు టీడీపీ ఎంపీలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ మహిళా నేత పురందేశ్వరి శుక్రవారం స్పందించారు.

  చదవండి: ప్రభావం ఉండదు: బాబుకు పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్, మోడీకి ఘాటుగా మోహన్ బాబు

  ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ పథకం ప్రకారం తప్పును బీజేపీ వైపు నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

  చదవండి: బాబు బయటకు, మోడీకి గడ్డుకాలం, నిజస్వరూపం బయటపడింది: శివసేన

  విభజన హామీలకు పదేళ్ల సమయం

  విభజన హామీలకు పదేళ్ల సమయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల అమలుకు పది సంవత్సరాల సమయం ఉందని పురంధేశ్వరి చెప్పారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌లోనే ఉంటూ అన్నీ చక్కదిద్దుకునే అవకాశాన్ని వదిలేశారని తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు.

  హోదాతో లాభం లేదని గతంలోనే చంద్రబాబు చెప్పారు

  హోదాతో లాభం లేదని గతంలోనే చంద్రబాబు చెప్పారు

  అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పురంధేశ్వరి చెప్పారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి లాభం ఉండదని చంద్రబాబు గతంలో స్వయంగా అంగీకరించారని ఆమె అన్నారు.

  డబ్బు తీసుకొని ఖర్చు చెప్పమంటే

  డబ్బు తీసుకొని ఖర్చు చెప్పమంటే

  ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా డబ్బు తీసుకుని ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాలని అడిగితే, ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం గొడవ చేస్తున్నారని పురంధేశ్వరి విమర్శించారు.

  టీడీపీ నేతల హస్తం

  టీడీపీ నేతల హస్తం

  కేంద్ర విద్యా సంస్థలకు తక్కువ నిధులు ఇస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని పురంధేశ్వరి చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు హోదాను కొనసాగించాలని కేంద్రం భావించడం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి లాభమేనని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP leader Purandeswari takes on AP CM Nara Chandrababu Naidu over Special Status issue.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి