విజయసాయిరెడ్డి పై పురందేశ్వరి సంచలన ఆరోపణలు..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మద్దతుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పైన తాజాగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేసిన పురందేశ్వరి ఇప్పుడు మద్యం సరఫరా పేరుతో టార్గెట్ చేస్తున్నారు. అదాన్ కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని, ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుందని ఆమె ఆరోపించారు.
వివరాలు చెప్పలేదు: ఎపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేసామని..టి వరకు ఆ వివరాలను చెప్పలేక పోయారని పురందేశ్వరి పేర్కొన్నారు. కంపెనీల వెనుక ఉన్న యాజమాన్యాల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయన్నారు.

వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుందని చెప్పిన పురందేశ్వరి..వంద కంపెనీలుు ఉంటే.. 16 కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యాత ఇస్తున్నారని వివరించారు. అదాన్ డిస్టలరీస్ 2019 లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16 నుంచి లో ప్రారంభించారన్నారు. ఈ అదాన్ కంపెనీకి 1,160కోట్ల కేటాయింపు జరిగిందని వివరించారు.
ఆర్దిక మంత్రికి ఫిర్యాదు: చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ కంపెనీల నుంచి కంపెనీలు లీజ్ కు తీసుకుని నడుపుతున్నారన్నారు.వీరిని బెదిరించి.. అదాన్ డిస్లరీస్ కంపెనీ సబ్ లీజ్ కు తీసుకున్నారని ఆరోపించారు. అదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు మాకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. ఎపీలో అప్పుల భారాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేశామని పురంధరేశ్వరి చెప్పారు.
పార్లమెంట్ లో చేసిన ప్రకటన ఆధారంగా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని వివరించామన్నారు. కార్పోరేషన్లు, రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని, ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. సీరియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చామని పురంధరేశ్వరి పేర్కొన్నారు.
వైసీపీ టార్గెట్ గా: మద్య నిషేధం అమలు చేయబోమని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు. ఫోన్ పే.. గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కన్పించవని నిలదీసారు. ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డిఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు.
ప్రకాశం జిల్లాలో పెర్ల్ డిస్టలరీస్ దీన్ని సీఎం జగన్ సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారని విమర్శించారు. దశల వారీగా మద్యం నిషేధిస్తామన్న జగన్.. వారి అనుయాయులతో మద్యం తయారు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రూ 56వేల కోట్ల ఆదాయం మీకు వస్తుంటే.. 20వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం చెబుతుందని పురందేశ్వరి వివరించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications