పురంధేశ్వరి రోడ్‌షో: బాలయ్యకోసం తారకరత్న(పిక్చర్స్)
చిత్తూరు/అనంతపురం: అభివృద్ధి వికేంద్రీకరణ తమ పార్టీతోనే సాధ్యమని కడప జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రక అవసరమని అన్నారు. ఈ రెండు పార్టీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో విద్య, ఉపాధి, వైద్యం, పరిశ్రమలు సమకూర్చాలంటే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారం చేపట్టాలని అన్నారు. తాము అధికారంలోకి రాగానే దుమ్ముగూడెం, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు సాగునీటిని తీసుకొస్తామన్నారు. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి పొంగిపోయానని తెలిపారు. అంతకుముందు మదనపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి తన 55వ పుట్టిన రోజు జరుపుకొన్నారు.
ఇది ఇలా ఉండగా సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరపున సినీ హీరో నందమూరి తారకరత్న ప్రచారం నిర్వహించారు. బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్త ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో తారకరత్న హిందూపురంలో బాలయ్య కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూపురం రూరల్ మండలం పోచనపల్లి, సంజీవరాయనపల్లి, నక్కలపల్లి, బేవనహళ్లి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం రోడ్ షోలు నిర్వహించారు. బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.
మరోవైపు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గడిచిన పదేళ్లలో తాను శింగనమల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

పురంధేశ్వరి ప్రచారం..
అభివృద్ధి వికేంద్రీకరణ తమ పార్టీతోనే సాధ్యమని కడప జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బాలయ్య కోసం తారకరత్న
హిందూపురం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరపున సినీ హీరో నందమూరి తారకరత్న ప్రచారం నిర్వహించారు. హిందూపురం రూరల్ మండలం పోచనపల్లి, సంజీవరాయనపల్లి, నక్కలపల్లి, బేవనహళ్లి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం రోడ్ షోలు నిర్వహించారు.

పాదయాత్రగా శైలజానాథ్
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గడిచిన పదేళ్లలో తాను శింగనమల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు.

బాలయ్య ప్రచారం..
బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో తారకరత్న హిందూపురంలో బాలయ్య కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications