వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలోకి దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి, ఆయన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో వారు ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.

దగ్గుబాటి దంపతులు గురువారం తమ అనుచరులతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, అధిష్టానం చాలా సన్నిహితంగా ఉన్నటువంటి తనలాంటి మంత్రులను కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదని, తాము చేసిన విజ్ఞప్తులన్నీ కూడా కాంగ్రెసు అధిష్టాన తుంగలోతొక్కిందని, ఏక నియంతృత్వధోరణితో వ్యవహరించిందని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తమ అనుచరులతో చెప్పినట్లు తెలియవచ్చింది.

Purandheswari

దగ్గుబాటి దంపతులు గురువారం హైదరాబాద్‌కు వచ్చి ముఖ్య అనుచరులు, నగర ప్రముఖులతో చర్చలుజరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అనంతరం ఏ పార్టీలో చేరేది ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నం సీటు నుంచి మారాలని తనను అధిష్టానం పెద్దలు అడిగిన తీరును కూడా పురంధేశ్వరి విమర్శించారు.

పార్టీ పెద్దలు తన పట్ల వ్యవహరించిన తీరును, రాష్ట్ర విభజన తీరును తప్పు పడుతూ పురంధేశ్వరి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు ఇంతకు ముందు లేఖ రాసిన విషయం కూడా తెలిసిందే. బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు పురంధేశ్వరి దంపతులకు సన్నిహితుడు. విభజన నేపథ్యంలో కాంగ్రెసు పెద్దల మనసు మార్చాలని పురంధేశ్వరి తన వద్దకు వచ్చి కోరినట్లు విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సభలో వెంకయ్య నాయుడు చెప్పారు.

వెంకయ్య నాయుడిని పురంధేశ్వరి అంకుల్ అని పిలుస్తుంది. ఈ సాన్నిహిత్యంతో పురంధేశ్వరి దంపతులు బిజెపిలోకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొద్దికాలం బిజెపిలో ఉండి బయటకు వచ్చారు.

English summary
It is said that former union minister Daggubati Purandhesari and her husband former MLA Daggubati Venkateswar Rao may join in BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X