విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురంధేశ్వరికి అసలుకే ఎసరు: విశాఖ సీటు వెనక్కి?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Purandheswari may out: TDP to take Visakha
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ అసలుకే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి పురంధేశ్వరిని పోటీకి పెట్టవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపి నాయకత్వానికి సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖపట్నం సీటును పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. అక్కడి నుంచి హరిబాబు గానీ పురంధేశ్వరి గానీ పోటీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి.

హరిబాబును ఒప్పించి, పురంధేశ్వరికి విశాఖ సీటును కేటాయించేందుకు బిజెపిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దానికి విరుగుడు కనిపెట్టింది. విశాఖ సీటును బిజెపి నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

విశాఖపట్నం సీటును తాము తీసుకుని కాకినాడ సీటును బిజెపికి కేటాయించాలని తాజాగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు బిజెపి జాతీయ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విశాఖ నుంచి గంటా శ్రీనివాస రావును పోటీకి దించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వల్ల పురంధేశ్వరి కష్టాల్లో పడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసుకు రాజీనామా చేసి, పురంధేశ్వరి బిజెపిలో చేరారు. అయితే, చంద్రబాబ నాయుడు తొలి నుంచీ పురంధేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుతో తనకు ఏ విధమైన వైరం లేదని, అధికార మార్పిడి తీరును వ్యతిరేకించానని పురంధేశ్వరి చెప్పినప్పటికీ చంద్రబాబు మనసు కరగడం లేదని అంటున్నారు.

English summary

 It is said that Telugudesam party president Nara Chandrababu Naidu is in bid take back Visakhapatnam Lok Sabha seat from BJP. With this Daggubati Purandheswari may face further trouble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X