ఎన్టీఆర్ ఉంటేనా.. టిడిపి ఎలా ఉందో..: పురంధేశ్వరి
హైదరాబాద్: ఎన్టీ రామారావు లేకపోవడమే రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలకు కారణమని ఆయన కూతురు, కేంద్రమంత్రి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ 18వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురంధేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఎన్టీఆర్ బతికి ఉన్నట్లైతే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కావని ఆమె అన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందో తెలుసునని ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానం చేశారు. ఎన్టీ రామారావు జీవించి ఉంటే విభజన పరిణామాలు మరో రకంగా ఉండేవని ఆమె అన్నారు. సత్తా ఉన్న నాయకత్వం ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమని ఆమె అన్నారు.

హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఉత్సవ్ రెస్టారెంట్‌ను ఆమె ప్రారంభించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను విశాఖపట్నం లోకసభ స్థానం నుంచే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశఆరు. మహిళా బిల్లును తెచ్చేందుకు కాంగ్రెసు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆమె చెప్పారు.
ప్రపంచ దేశాలు సైతం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయని పురంధేశ్వరి అన్నారు. దేశంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమె అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువకులు విదేశాలకు వెళ్లకుండా మాతృదేశానికి సేవ చేయడం అభినందనీయమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications