బాలయ్యపై తెలీదు, ఎన్టీఆర్ బిడ్డను: పురంధేశ్వరి

అనంతపురం: తన సోదరుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తనకు తెలియదని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గురువారంనాడు ఆమె అనంతపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై తన పార్టీ నాయకత్వం సంప్రదింపులు చేస్తోందని ఆమె చెప్పారు.

తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ నేతల సంప్రదింపులు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని ఆమె అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ నేత నరేంద్ర మోడీ వల్లనే సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు.

Purandheswari says she doesn't know about Balayya

నందమూరి తారక రా మారావు బిడ్డగా నేను మీ ఆడపడుచునంటూ పురంధేశ్వరి ఎన్నికల ప్రచార సభలో చెప్పుకొచ్చారు. బీజేపీ తరపున పార్లమెంట్ స్థానాలకు నిలబడే అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి సహకరించాలని కోరారు. లోక్‌సభలో బిజెపి సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర విభజనను చేసేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండిందని పురంధేశ్వరి అన్నారు.

చిన్న రాష్ట్రాలకు అనుకూలమన్న మాటపై కట్టుబడి ఉంటూనే రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం కో సం పాటుపడిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. కొన్ని పార్టీలు ఆర్టికల్ 3 ప్రకారం రా ష్ట్రాన్ని విభజించవచ్చునని, సమన్యాయం చేయాలంటూ మరో పార్టీ చెబుతూ ప్రజలు మోసం చేశాయని ఆమె వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. బిజెపి సమన్యాయం చేయాలని డిమాండ్ చేయడంతోపాటు సీమాంధ్రకు ఏం చేయాలో చెప్పిందన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసిన ఘనత తమ పార్టీదేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+