Pushpa -2: తగ్గిన పుష్ప 2 టికెట్ ధరలు - బాక్సాఫీస్ ఊచకోత, మరో రికార్డు..!!

బ్లాక్​ బస్టర్ టాక్ తెచ్చుకున్న పుష్ప-2 కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మూడు రోజుల్లోనే 'పుష్ప ది రూల్' రూ.621 కోట్లు వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వైల్డ్ ఫైర్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్ అందుకు న్న సినిమాగా పుష్ప అరుదైన రికార్డ్ కొట్టింది. అన్ని భాషల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది.కాగా, పుష్ఫ -2 సినిమా టికెట్ ధరలు నేటి నుంచి తగ్గనున్నాయి. కొత్త టికెట్ ధరలను ఖరారు చేసారు.

రికార్డుల వేట
పుష్ప బాక్సాఫీస్ ఊచకోత కొనసాగుతోంది. రికార్డులు క్రియేట్ చూస్తూ దూసుకెళ్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హిందీలో అత్యంత వేగంగా రూ.200 కోట్ల క్లబ్​లో చేరిన సినిమాగా పుష్ప రికార్డు కొట్టింది. వరల్డ్​ వైడ్​గా 12వేలకు పైగా స్క్రీన్లలో రిలీజైన పుష్ప అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఓవర్సీస్​లోనూ కాసుల వర్షం కురుస్తోంది. ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. ఇక వీకెండ్ ఆదివారం కూడా మంచి వసూళ్లను సాధించింది. ఆదివారం రోజు లక్షా 25వేల డాలర్ల కలెక్షన్లు క్రాస్ చేసింది. కాగా సోమవారం (డిసెంబర్ 09) నుంచి పుష్ప 2 టికెట్ ధరలు తగ్గనున్నాయి. కొత్త ధరలను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

Pushpa - move ticket rates reduced from Monday as movie makers latest announcement

తగ్గిన ధరలతో
ప్రీమియం షోలకు భారీగా టికెట్ ధరలు ఖరారు చేయటం పైన విమర్శలు వచ్చాయి. అయితే, ఆ ధరలను ప్రీమియం షోల వరకే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ రోజు నుంచి టికెట్ ధరలు తగ్గించారు. ప్రీమియం షో టికెట్ ధర వెయ్యి రూపాయల వరకు పలికింది. ఇక, సింగిల్ స్క్రీన్ ధరలు భారీగా ఉన్నాయి. ఇక, ఈ నెల 16వ తేదీ దాకా సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే విధంగా ఇక సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర రూ.200 ఉంది.

కాగా, మల్టీప్లెక్స్‌లో రూ.395గా అమ్మకాలు సాగుతున్నాయి. ఏపీలోనూ మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ.300 ఉండగా, సింగిల్‌ స్క్రీన్‌లో రూ.220గా నిర్ణయిం చారు. వైజాగ్‌లో సింగిల్‌ స్క్రీన్‌లో రూ.295 ఉండగా, మల్టీప్లెక్స్‌లో రూ.300-377 వరకూ బుక్‌మై షో ధరలు ఉన్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా ధరల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+