రోడ్డు తుడిచిన సింధు: చీపురు పట్టిన నారా రోహిత్
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు శనివారంనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సింధు హాజరై రోడ్డును శుభ్రం చేశారు. ఆ తర్వాత మొక్కలు నాటారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జాబితాలో సినిమా హీరో నారా రోహిత్ కూడా చేరారు. ఆయన శనివారంనాడు హైదరాబాదులోని ఈసిఐఎల్ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు పాల్గొ్న్నారు. శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, టిడిపి నాయకులు పాల్గొని రోడ్లను ఊడ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇంతకు ముందే పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications