Axis My India కు బద్ధకం ఎక్కువ
India Today Axis My India Exit Poll on AP: దేశవ్యాప్తంగా చివరి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై జాతీయ స్థాయి సంస్థలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వేర్వేరు అంచనాలను వెల్లడించాయి.
అసెంబ్లీలో ఒక రకంగా, లోక్‌సభలో మరో తీరుగా అవి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరా మస్తాన్, పార్ధా చాణక్య, పోల్ స్ట్రాటజీ, జన్మత్, పోలిటికల్ క్రిటిక్ వంటి సర్వే ఏజెన్సీలో వైఎస్ఆర్సీపీకి అబ్సల్యూట్ మెజారిటీని ప్రకటించాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు మాత్రం దీనికి పూర్తి భిన్నమైన ఫలితాలను విడుదల చేశాయి.

అత్యంత విశ్వసనీయత ఉన్నట్లుగా చెప్పుకొనే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సైతం వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓడిపోబోతోందని అంచనా వేసింది. అసెంబ్లీలో 55 నుంచి 77 సీట్లే వస్తాయని తెలిపింది. లోక్‌సభలో 2 నుంచి 4 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీని పరిమితం చేసిందా సంస్థ.
తెలుగుదేశం పార్టీకి 78 నుంచి 96, జనసేనకు 16 నుంచి 18, భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6 అసెంబ్లీ సీట్లు దక్కుతాయని తెలిపింది. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో బోణీ చేస్తుందని, కనీసం రెండు సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది.
ఏపీ అసెంబ్లీపై ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా తన ఈ ఎగ్జిట్ పోల్ నివేదికలను వెల్లడించిన వెంటనే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి పీవీఎస్ శర్మ స్పందించారు. ఈ లెక్కలను తప్పు పట్టారు. ఏపీలో ఓటర్ల నాడిని పట్టడంలో యాక్సిస్ మై ఇండియా విఫలమైందని వ్యాఖ్యానించారు.
Voting from 4 pm to beyond 12 midnight on the polling day is the clincher for @YSRCParty
— PVS Sarma (@pvssarma) June 2, 2024
That’s was the strategy of Jagan.
Surely, lazy @AxisMyIndia chaps missed it.
Rest all cooked up numbers.
మే 13వ తేదీ పోలింగ్ రోజున సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటింగ్ జరగిందని పీవీఎస్ శర్మ గుర్తు చేశారు. ఆ సమయంలో జరిగిన పోలింగే వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని అప్పగిస్తుందని పేర్కొన్నారు. దాన్ని జగన్ వ్యూహంగా అభివర్ణించారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఓటు వేసిన వారి అభిప్రాయాలను సేకరించడం యాక్సిస్ మై ఇండియా విఫలమైందని, దానికి బద్ధకం ఎక్కువైందని ఎద్దేవా చేశారు. అందుకే అంకెలను వండి తెచ్చారని చురకలు అంటించారు












Click it and Unblock the Notifications