మంత్రి మాణిక్యాలరావుకు అవమానం: దేవినేని రావడంతో వాళ్లంతా?..

మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పట్ల విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

విజయవాడ: మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పట్ల విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలయ వెనుక భాగం నుంచి లోపలికి వెళ్తున్న క్రమంలో సిబ్బంది గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు.

సిబ్బంది నిర్వాకంతో ఆయన అరగంట పాటు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. అదే సమమంలో మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు రావడంతో ఆలయ సిబ్బంది అంతా అటువైపు వెళ్లారు. దీంతో మంత్రి మాణిక్యాలరావును ఎవరూ పట్టించుకోలేదు.

pydikondala manikyala rao felt insulted by vijayawada temple officials

సిబ్బంది నిర్వాకం పట్ల మంత్రి మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులను ఆదేశించారు. మహామండపం మెట్ల మార్గంలో పారిశుద్ద్య పనులు ఎందుకు చేపట్టలేదని మండిపడ్డారు. శానిటేషన్ కాంట్రాక్టరుకు వెంటనే నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఘటనపై బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+