ప్రతిపక్షాల కాకిగోల పట్టించుకోం, కారణం వాళ్లే: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ బడ్డెట్‌లో బీసీలపై వివక్ష చూపారని తెలుగుదేశం పార్టీ నేత ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. బీసీ నిధులు 3 శాతం నుంచి 2 శాతనికి తగ్గంచారని ఆరోపించారు. బీసీలంటే ప్రభుత్వానికి అంత చులకనా అంటూ ఆయన ప్రశ్నించారు.

బీసీల బడ్జెట్ రూ. 2 వేల కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెచాలన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కదాన్నీ అమలు చేయడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ విద్యపై ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు.

ఎన్నికల హామీల్లో ఇంటికో ఉద్యోగమన్నారని, బడ్జెట్‌లో మాత్రం నిరుద్యోగులకు కేటాయింపుల్లేవన్నారు. బీసీల కేటాయింపుపై స్పందిచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని అన్నారు. కళ్యాణ లక్ష్మీ పధకాన్ని అన్ని వర్గాల వారికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

R Krishnaiah slams trs government over budget allocation

కాంగ్రెస్, టీడీపీలే కారణం: కె. తారక రామారావు

ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలు ఆశలు నేరవేర్చే విధంగా ఉందన్నారు.

గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆడిన మైనార్టీలకు వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాబోయే కాలంలో నల్లా ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని కె. తారకరామారావు పేర్కొన్నారు.

తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఎంగిలి మెతుకులు తినే అలవాటుందని మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.

ప్రతిపక్షాల కాకిగోలలను పట్టించుకోమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ కోతలు, రైతుల ఇబ్బందులు వాస్తవమేనని ఆయన అన్నారు. వీటన్నిటికి నలభై రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, పదిహేనేళ్లు పరిపాలించిన టీడీపీలదేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+