జగన్ ప్లాన్ : రాధా డైరెక్షన్ లో వైసీపీ విజయవాడ పాలిటిక్స్
విజయవాడ : వైసీపీ నేత వంగవీటి రాధాకు అదనపు బాధ్యతలను అప్పగించారు పార్టీ అధినేత జగన్. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర యువ విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రాధాకు, తాజాగా విజయవాడ నగర బాధ్యతలు అప్పగించారు. విజయవాడ వైసీపీ అధ్యక్షునిగా రాధాను నియమిస్తూ పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
రాధా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. భవిష్యత్ లో పార్టీని మరింత పటిష్టపరిచే యోచనలో భాగంగానే రాధాకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. విజయవాడలో అధికార టీడీపీని ఎదుర్కోవడానికి రాధానే కరెక్ట్ అని భావించిన జగన్, ఈ కారణంగానే నగర బాధ్యతలు మొత్తం రాధా పర్యవేక్షణలో ఉండేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













Click it and Unblock the Notifications