వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటి నుంచి ఏపీలో పదోతరగతి రేడియో పాఠాలు - షెడ్యూల్ ఇదే...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అవుతున్న పదో తరగతి విద్యార్ధులకు ఆడియో పాఠాలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి ఆకాశవాణి రేడియో ద్వారా ఆడియో పాఠాలను వారికి అందించనున్నారు. ఇప్పటికే దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేస్తున్న ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ సాయంతో ఆడియో పాఠాల ప్రసారానికి సిద్ధమైంది.

ఏపీలో ఇక రేడియో పాఠాలు..
కరోనా వైరస్ కారణంగా ఏపీలో ఈ సీజన్ లో స్పెషల్ క్లాసులతో బిజీగా ఉండాల్సిన పదో తరగతి విద్యార్ధులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్ధితి. విద్యాసంస్ధలు మూతపడటంతో ఇళ్ల వద్దనే ఉంటూ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధుల కోసం ప్రభుత్వం ఇప్పటిటే దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాలు అందిస్తోంది. ఇదే తరహాలో ఆకాశవాణి ద్వారా రేడియోలో ఆడియో పాఠాలు కూడా అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి ఆడియో పాఠాలు ప్రారంభం కానున్నాయి.

radio lessons for ap ssc students from tomorrow

Recommended Video

Corona Crisis : Tension In Employees Over Pay Cuts

రేడియో పాఠాల షెడ్యూల్...
సర్వశిక్షా అభియాన్ అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పదోతరగతి విద్యార్థుల కోసం బుధవారం నుంచి మే 15వ తేదీ వరకు రేడియోలో పాఠాలు ప్రసారం కానున్నాయి. ఇందులో ఏప్రిల్‌ 22 నుంచి 24వరకు తెలుగు, ఏప్రిల్ 25 నుంచి 27 వరకూ హిందీ, ఏప్రిల్ 28 నుంచి మే1 వరకూ ఇంగ్లీష్, మే 2 నుంచి 5వ తేదీ వరకూ గణితం, మే 6 నుంచి 8వ తేదీ వరకూ భౌతికశాస్త్రం, మే 9 నుంచి 11వ తేదీ వరకూ జీవశాస్త్రం, మే 12 నుంచి 15వ తేదీ వరకు సాంఘికశాస్త్రం పాఠాలు ప్రసారమవుతాయని అధికారులు ప్రకటించారు. రోజూ ఉదయం 11గంటల 5 నిమిషాల నుంచి 11గంటల 35 నిమిషాల వరకు పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.

English summary
andhra pradesh govt is made arrangements for transmission of audio lessons to ssc students through akasavani radio from tomorrow. according to the decision, sarva siksha abhiyan officials announced transmission schedule today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X