కిరణ్ పార్టీ అక్రమమే: కొండా, ఎన్నికలవరకన్న వీహెచ్

ఎన్నికల ఆలస్యం వల్ల రాష్ట్రానికి రావాల్సిన వేలకోట్ల నిధులు కూడా రాకుండా పోయాయని రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒక్కటై మాయాకూటమిగా ఏర్పడినా తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొలేరని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే టిడిపి అధ్యక్షుడు అన్ని పార్టీల నేతలను తన పార్టీలో చేర్పించుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల తర్వాత కిరణ్ పార్టీ ఉండదు: వీహెచ్
వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఉంటుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఉండదని చెప్పారు. ఎన్నికల్లో కలెక్షన్స్ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టారని ఆయన ఆరోపించారు.
సీమాంధ్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అని హనుమంతరావు విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలోనే బలం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ తొలగిస్తుందనే ఇప్పుడు సిఎం పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. సుప్రీం కోర్టు విభజనపై స్టే ఇవ్వలేదంటే సీమాంధ్ర మేధవులు ఆలోచించాలని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాయమాటలకు అమాయకులు బలికావొద్దని వీహెచ్ అన్నారు.












Click it and Unblock the Notifications