సీఎం జగన్ పేషీ నుంచి వేధింపులు - ప్రధాని భీమవరంకు వచ్చిన వేళ : రఘురామ లేఖ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేంద్రానికి మరో లేఖ రాసారు. కేంద్ర కేబినెట్ కార్యదర్వి రాజీవ్ గౌబాకు లేఖ రాసిన ఆయన ఈ సారి సీఎం పేషీ నుంచి వేధింపులు కొనసాగున్నాయని ఫిర్యాదు చేసారు. ఏపీలో సివిల్స్ అధికారుల పైన సీఎంఓ నుంచి వేధిస్తున్నారని..అడ్డుకోవాలని కోరారు. ఏపీలో సీఎం ఆదేశాలను అమలు చేయటం మినహా.. అధికారులు ఏ పనీ చేయట లేదని లేఖలో వివరించారు. ఏపీ ప్రభుత్వం పాలనా నియమాలను గాలికి వదిలేసిందని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో అరాచక పరిస్థితులు
ముఖ్యమంత్రిని..ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని సంతృప్తి పర్చేందుకు అఖిల భారత సర్వీసు అధికారులు పని చేస్తున్నారంటూ లేఖలో వివరించారు. పాలన పట్టించుకోకపోవటంతో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని ఫిర్యాదు చేసారు. అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన ప్రధాని మోదీ భీమవరం పర్యటన వేళ అంశాలను లేఖలో వివరించారు. ప్రధాని అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరయ్యారని, ప్రొటోకాల్ ప్రకారం తాను హాజరుకావాల్సి ఉందన్నారు. అయితే, తాను హాజరు కాకుండా ఏపీ ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించిందంటూ రఘురామ తన లేఖలో కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించారు.

కలెక్టర్ ను బెదిరించారు
తాను ఫోన్ చేస్తే సమాధానం ఇచ్చారనే కారణంతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతిని సీఎం కార్యాలయానికి పిలిపించి బెదిరించారని రఘురామ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇటువంటి బెదిరింపు వైఖరిని నియంత్రించకపోతే.. అధికార వ్యవస్థ అచేతనంగా మారే ప్రమాదం ఉందని రఘురామ చెప్పుకొచ్చారు. సీఎం హోదాలో ఉన్న జగన్ పైన రూ 43 వేల కోట్ల అక్రమాస్తులకు సంబంధించి 32 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పదేళ్లుగా ఆయన కోర్టులకు వెళ్లకుండా మినహాయింపు పొందుతున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రస్తావిస్తున్నందుకు తన పైన రాజద్రోహం తో పాటుగా అనేక కేసులు బనాయిస్తున్నారని తన లేఖలో రఘురామ వివరించారు.

వేధిస్తున్నారు..విచారించండి
తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టారు.. సుప్రీంకోర్టు జోక్యంతో తాను బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. తనకు మద్దతుగా ఉంటున్న వారిని..తన ఫ్లెక్సీలు కట్టిన వారిని సైతం వేధిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం దెబ్బ తినటానికి రాష్ట్రంలో ప్రధాన వ్యవస్థల అధిపతుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ మొత్తం పరిణామాల పైన పైన సమాచారం సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో అధికార వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరారు. అది జరగకపోతే..రాష్ట్ర పాలనా వ్యవస్థ పైన విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని రఘురామ లేఖలో పేర్కొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications