చిరంజీవి టీంకు లోపలకు నో ఎంట్రీ - విష్ణు మాత్రం : ఎంపీ హల్ చల్ చేస్తే - రఘురామ సంచలనం..!!
వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు..వ్యవహారాల పైన నిత్యం విరుచుకుపడే రెబల్ ఎంపీ రఘురామ రాజు తాజా అంశాలపైన స్పందించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేయటం పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. సవాంగ్‌ను తప్పించడానికి కారణాలేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసారు. జగన్ గతంలో.. సవాంగ్, ఎల్వీ సుబ్రమణ్యం రెండు కళ్లన్నారంటూ వ్యాఖ్యానించారు. ఐదు వందల కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి తగులబెట్టిన గౌతమ్‌సవాంగ్‌ను సన్మానిస్తారని భావిస్తే.. ఏకంగా ఉద్యోగమే తీసివేశారంటూ రఘురామ చెప్పుకొచ్చారు.

సవాంగ్ ను ఒత్తిడికి గురి చేసి..
గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న వైకాపా నాయకుల ఒత్తిడి వల్లే ఆయన్ను తొలగించారన్న ప్రచారం నడుస్తోందని ఆరోపించారు. గంజాయిని తగలబెట్టారని ఫిర్యాదు వచ్చిందనే తీసేశారా అంటూ ప్రశ్నించారు. తనను కస్టడీలోకి తీసుకున్న సమయంలో దాడికి సంబంధించి కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసిన రఘురామ..ఆ లేఖ ప్రభావం సవాంగ్ ను ఒత్తిడికి గురి చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కొత్త డీజీపీ పైన ఏపీ ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లు షార్ట్ లిస్ట్ చేసి పంపిదని చెప్పారు. ఆ మూడు పేర్లలో రాజేంద్రనాధ్ రెడ్డి పేరు ఉందో లేదో చూడాలంటూ వ్యాఖ్యానించారు. యూపీఎస్సీకి సవాంగ్ తొలిగింపు పైన ఏం చెబుతారని రఘురామ ప్రశ్నించారు.

కొత్త డీజీపీకి అగ్ని పరీక్ష
ఇక, కొత్త డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారంటూ వ్యాఖ్యానించారు. తాజాగా బెజవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ లో ఒక ఎంపీ హల్ చల్ చేసారంటూ పరోక్షంగా రాత్రి జరిగిన ఘటనను ప్రస్తావించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసారని...ఈ కేసులో డీజీపీ ఏం చేస్తారో చూడాలని రఘురామ పేర్కొన్నారు. గత వారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశానికి వచ్చిన సినిమా హీరోల కార్లను కనీసం లోపలకు రానీయలేదని రఘురామ చెప్పుకొచ్చారు. అయితే, మంగళవారం మంచు విష్ణు కారును లోపలకు అనుమతిచ్చి..భోజనం పెట్టి పంపారంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడంపై కొందరు పిటిషన్ వేశారని చెబుతూ... దీని పైన ఏపీ హైకోర్టులో మంచి తీర్పు వచ్చిందని అభిప్రాయ పడ్డారు.
Recommended Video

చిరంజీవి టీంతో అలా..విష్ణుతో ఇలా
ఎవరో అప్రూవర్ గా మారితే వాళ్లకు బాధేంటో అర్దం కావటం లేదని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నెల 11వ తేదీన పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు పూర్తవుతూనే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ గతంలో పలుమార్లు ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఆయన సరైన సమయంలో రాజీనామా నిర్ణయం తీసుకుంటానంటూ వెల్లడించారు. ఇక, వైసీపీ నేతలు తన పైన అనర్హత వేటు కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చని గతంలోనే పలు సందర్బాల్లో రఘురామ పేర్కొన్నారు. దీంతో..రఘురామ రాజీనామా వ్యవహారం పైన సస్పెన్స్ మరి కొంత కాలం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications