జగన్‌కు ఝలక్: బిజెపిలో చేరిన రఘురామ రాజు

ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌వర్మ ఉన్నారు. తమ పార్టీలో చేరడానికి నాయకులు బారులు తీరుతున్నారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన అన్నారు.
సీమాంధ్రకు న్యాయం చేయడానికి అవసరమైన సవరణల కోసం తాము ఒత్తిడి చేస్తామని, యుపిఎ ప్రభుత్వం న్యాయం చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన పూర్తయ్యే వరకు ఏ పార్టీతోనూ తాము పొత్తు కసరత్తు చేయబోమని ఆయన అన్నారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లులో తాము ప్రతిపాదించే సవరణలకు ప్రభుత్వం అంగీకరిస్తుందని తాము ఆశిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications