వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గారూ.. ఆ వెధవ మాటలు విని అనర్హత వేటేస్తారా? పిటిషన్ వాపస్ తీసుకోండి: ఎంపీ రఘురామ సంచలనం

|
Google Oneindia TeluguNews

వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. సీఎం జగన్ పట్ల గౌరవం ఉందంటూనే, వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ కీలక నేతలు, మంత్రుల తీరుపై రఘురామ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రెబల్ ఎంపీ.. ప్రతిరోజూ మీడియా సమావేశం నిర్వహిస్తూ సొంత పార్టీపై రకరకాలుగా విమర్శల బాణాలు వదులుతున్నారు. మంగళవారం మరో అడుగు ముందుకేసి.. తనపై దాఖలైన అనర్హత పిటిషన్ ను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అడ్డంగా దొరికిన చైనా - కిడ్నాపైన భారతీయులు డ్రాగన్ చెరలోనే - విడుదలపై కేంద్ర మంత్రి ప్రకటనఅడ్డంగా దొరికిన చైనా - కిడ్నాపైన భారతీయులు డ్రాగన్ చెరలోనే - విడుదలపై కేంద్ర మంత్రి ప్రకటన

మోదీ మాటలనే ముందుగా నేను..

మోదీ మాటలనే ముందుగా నేను..

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటేయాలంటూ వైసీపీ నేతలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చిన పిటిషన్ లో ‘విద్యావిధానంపై పార్టీ లైన్ కు విరుద్ధంగా మాట్లాడారు' అనే అంశాన్ని ప్రధానంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, విద్యా విధానం గురించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలనే తాను కొద్ది రోజుల కిందటే చెప్పానని, విద్యావిధానంపై ముందే ఊహించి చెప్పినందుకు అభినందించాల్సిందిపోయి, పదవి నుంచి తప్పించాలనడం విడ్డూరంగా ఉందని రఘురామ అన్నారు.

ఆ వెధవ చెబితే వింటారా?

ఆ వెధవ చెబితే వింటారా?

తనపై అనర్హత వేటు వివాదానికి సంబంధించి ఎంపీ రఘురామ మొదటి నుంచీ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తుండటం తెలిసిందే. మంగళవారం నాటి ప్రెస్ మీట్ లోనూ విజయసాయి పేరును పలక కుండా ‘ఓ పనికిమాలిన వెధవ' అంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం జగన్ పక్కనే ఉండే ఓ పనికిమాలిన వెధవ.. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో ఈజీగా నన్ను డిస్‌క్వాలిఫై చేయిస్తానని అన్నాడట. సీఎంను ఆ పనికిమాలిన వెధవే పక్కదారి పట్టించాడు. ఆ వెధవ ఎవరో రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. జగన్ గారూ.. అలాంటివాళ్లను పక్కన పెట్టేసి, మీరు మీ మంచి మనసుతో ఆలోచించండి'' అని రఘురామ అన్నారు.

అనర్హత పిటిషన్ వెనక్కి..

అనర్హత పిటిషన్ వెనక్కి..

మానవులు అన్న తర్వాత ఎవరైనా తప్పులు చేస్తారని, ఇంగ్లీష్ మీడియంలో బోధన అంశంలో సీఎం జగన్ కూడా తప్పు చేశారని, అయితే, చేసిన తప్పును సరిదిద్దు కోవడం మానవ లక్షణమని, జగన్ కూడా హుందాగా ఆ ఆలోచనకు స్వస్తి చెప్పాలని ఎంపీ రఘరామ హితవు పలికారు. ఏ అంశంపై మాట్లాడినందుకు తనపై చర్యలకు పూనుకున్నారో, ఆ మీడియం అంశంపై ఇప్పుడు ప్రధాని, కేంద్రం క్లారిటీ ఇచ్చినందున ఇంతటితో వివాదానికి ముగింపు పలకాలని, ఇప్పుటికైనా అనర్హత పిటిషన్ ను వాపస్ తీసుకోవాలని వైసీపీ అధినేత జగన్‌కు రఘురామ సూచించారు.

చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటనచైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటన

English summary
narsapuram ysrcp rebel mp raghu rama krishnam raju once again targets own party leaders. speaking to media in delhi on tuesday, mp says, a key person who is very close to cm ys jagan is taking damage to party, raghurama demands to withdraw disqualification petition against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X