అసెంబ్లీలో రఘురామ కృష్ణంరాజుకు ఘోర అవమానం..జగన్‌తో భేటీ అందుకేనా..?
వివాదాస్పద నేతగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌తో రఘురామ కృష్ణంరాజు కాసేపు ముచ్చటించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన ఆయన గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన.
ఆ తర్వాత కూటమి తరుఫున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెరవెనుక పావులు కదిపిన ఆయన ఎలాగైతే టీడీపీ తరుఫున టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రఘురామ కృష్ణంరాజుకు ఘోర అవమానం జరిగినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రులు కారులకు మాత్రమే అనుమతి ఉండటంతో రఘురామ కృష్ణంరాజు కారును అధికారులు గేటు ముందే ఆపేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ,మంత్రుల కాన్వాయ్‌లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడితో ఆగని ఆయన... ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని తన లేఖలో కోరారు. ఈ ఘటన తర్వాతే తర్వాతే జగన్‌తో రఘురామ కృష్ణం రాజు ముచ్చటించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించకుంది. జగన్‌ను అసెంబ్లీకి రావాలని రఘురామ కోరడం, ఆయన కోరినట్టుగానే జగన్ అసెంబ్లీకి వస్తానని చెప్పడం జరిగిందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి టీడీపీలో కూడా రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్‌గా మారారనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications