రఘురామ మరో సంచలనం-సత్తెనపల్లి దగ్గర హత్యకు కుట్ర-రైలు బోగీ తగులబెట్టి-అదే చివరిరోజు
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేసే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరింత సంచలనం రేపారు. నిన్న ప్రధాని మోడీ భీమవరం టూర్ సందర్భంగా వచ్చేందుకు ప్రయత్నించిన తనను చంపేందుకు ఏపీ పోలీసులు కుట్ర పన్నారంటూ ఆయన ఆరోపించారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

రఘురామ హత్యకు కుట్ర
నిన్న ప్రధాని మోడీ భీమవరం టూర్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి నరసపూర్ ఎక్స్ ప్రెస్ లో వచ్చేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలం కావడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇవాళ మరోసారి స్పందించారు. తనను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆయన ఇవాళ బయటపెట్టారు. అంతే కాదు ఏపీ పోలీసులు తన హత్యకు కుట్ర పన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకూ ఏం జరిగిందో ఆయన చెప్పడమే కాదు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

సత్తెనపల్లి వద్ద బోగీ తగులబెట్టే ప్లాన్?
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద తాను ప్రయాణించే ట్రైన్ బోగీ తగులబెట్టేందుకు కుట్ర జరిగిందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చే మార్గంలో సత్తెనపల్లి వద్ద బోగీ తగులబెట్టి తనను హతమార్చే ప్లాన్ జరిగిందని రఘురామ ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఆదేశాలు వెళ్లాయో కూడా ఆయన బయటపెట్టారు. తద్వారా తనను భీమవరం రాకుండా అడ్డుకున్నట్లు రెబెల్ ఎంపీ తెలిపారు. దీంతో రఘరామ టూర్ రద్దు చేసుకోవడానికి గల కారణం ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డీజీ కార్యాలయం నుంచే ఆదేశాలు?
తాను ప్రయాణిస్తున్న రైలు బోగీ తగులబెట్టాలని డీజీ ఆఫీసు నుంచే ఆదేశాలు వెళ్లాయని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఆరోపించారు. అంతే కాదు ఇందుకు తగిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. వీటి ద్వారానే తనకు సమాచారం అందిందన్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న తర్వాతే ఆయన భీమవరం టూర్ రద్దు చేసుకున్నారో లేదో మాత్రం రఘురామ చెప్పలేదు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

రఘురామకు అదే చివరిరోజు?
మరోవైపు సొంత పార్టీ ఎంపీని హత్య చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేత బోండా ఉమ కూడా ఆరోపించారు. రఘురామ నిన్న హైదరాబాద్ నుంచి భీమవరానికి రైల్లో బయలుదేరి ఉంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని బోండా ఉమ సంచలన విమర్శలు చేశారు. దీంతో రఘురామ బేగంపేటలోనే రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారన్నారు. అంతే కాదు ఇది నిజం కాదని వైసీపీ అంటే సీబీఐతో విచారణ చేయించాలన్నారు. ప్రధాని రాక సమయంలోనే ఎంపీ హత్యకు కుట్ర పన్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్ధం అవుతోందన్నారు.












Click it and Unblock the Notifications