అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్రీ క్యాపిటల్స్ అద్భుతం- అమరావతి యాత్ర అడ్డుకుంటే రాష్ట్రపతి పాలనే-రఘురామ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ పాదయాత్రను అడ్డుకోవాలని ఏకంగా మంత్రులే పిలుపునిస్తున్న నేపథ్యంలో.. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో రైతులపాదయాత్రను అడ్డుకోవాలనుకుంటే... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖాయమన్నారు.

న్యాయస్థానం అనుమతితో శాంతియుతంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అల్లర్ల ద్వారా అడ్డుకోవాలని చూస్తే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. అమరావతి రైతుల పాదయాత్ర ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక దాడులకు దిగితే పోలీసు వ్యవస్థపై, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఈ దాడులను రాష్ట్ర ప్రభుత్వ, సీఎం జగన్ ప్రాయోజిత దాడులుగా ప్రజలు పరిగణిస్తారన్నారు. కాబట్టి పిచ్చి ప్రయత్నాలను మానుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

raghurama raju warns 3 capitals concept miracle but president rule if stop amaravati yatra

రాష్ట్రంలో ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించాలని కోరుకుంటే మాత్రం పాదయాత్రను అడ్డుకోవాలని వైసీపీ సర్కార్ ను రఘురామ కోరారు. రైతుల పాదయాత్రను న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి భవన్ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉన్నాయని, రైతుల పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు కలిగించిన తమ ప్రభుత్వానికి తిప్పలు తప్పవన్నారు. అమరావతి రైతుల పాదయాత్ రగుంటూరు, కృష్ణాజిల్లాలలో అద్భుతంగా సాగిందని, ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ, కృష్ణాజిల్లా గుడివాడ లోను రైతుల పాదయాత్రకు ఆటంకాలు కలిగించాలని చూశారని పేర్కొన్నారు. అయినా రైతు పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు.

కేబినెట్ ఆమోదించిన రాజధానిని హైకోర్టు తిరస్కరించాక తిరిగి సుప్రీంకోర్టులో స్టే కూడా రాలేదని, కేసు అసలు లిస్టే కాలేదని, అటువంటప్పుడు మంత్రులు దీనిపై మాట్లాడకూడదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. దీనిపై మాట్లాడేవారు బుద్ధి జ్ఞానం లేని వారై ఉండాలన్నారు. మంత్రులు అంటేపాలకులని, న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినప్పుడు, ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. మరోవైపు మూడు రాజధానుల కాన్సెప్ట్ అద్భుతమని, కానీ దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ విధానం అమలులో లేదని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఒక్క దక్షిణాఫ్రికా దేశంలో మాత్రమే మూడు రాజధానుల విధానం అమల్లో ఉన్నదని, ఆ దేశంలోనూ ఇప్పుడు ఒకే రాజధానిని కోరుకుంటున్నారని చెప్పారు

English summary
ysrcp rebel mp raghurama krishnam raju on today slams ysrcp govt for their plans to stop amaravati padayatra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X