చంద్రబాబు, కెసిఆర్ పందెం కోళ్ల లాగా: రఘువీరా
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పందెం కోళ్ల మాదిరిగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన భవన్‌లో శనివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, విద్యార్థుల ఉపకార వేతనాలపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెసు పార్టీకి పదవులు, అధికారం ముఖ్యం కావని మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications