మోడీ ద్రోహాన్ని బీహార్‌కు వెళ్లి చెబుతాం: హోదాపై ప్రకటన చేయాలన్న రఘువీరా
హైదరాబాద్: అక్టోబర్ 22న జరగనున్న అమరావతి శంకుస్థాపన కోసం వస్తున్నప్రధాని నరేంద్ర మోడీ ధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంపై స్పష్టత ఇవ్వాలని ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే.. ఏపీకి జరిగిన మోసాన్ని ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలో ప్రచారం చేస్తామని చెప్పారు.
రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని.. ప్రత్యేక హోదా, విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాని స్పందించక పోతే.. బిజెపి ద్రోహాన్ని ఎండగతామని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అక్టోబర్ చివరలో బీహార్ వెళ్లనున్నట్లు తెలిపారు.

ఏపికి చేసిన ద్రోహాన్నే బీహార్‌లో చెబుతామని తెలిపారు. పార్లమెంటుపై గౌరవముంటే ఏపికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.
ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్‌లో జరిగిన అభివృద్ది తీరుతెన్నులను పరిశీలించేందుకు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వివరించారు. వారం రోజులుగా ప్రధాని అపాయింట్‌మెంట్ అడుగుతున్నా స్పందించక పోవడం దారుణమని అన్నారు.












Click it and Unblock the Notifications