వందలకోట్ల అప్పులు ఎగ్గొట్టిన సుజన: రఘువీరా

Subscribe to Oneindia Telugu

విజయవాడ: బ్యాంకులకు వందల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన సుజనా చౌదరిలాంటివారు కేంద్ర మంత్రిగా ఉండొచ్చా? సామాన్యులు మాత్రం తమ సొంత డబ్బు కోసం క్యూలైన్లలో నిలబడి చావాలా? అంటూ ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆక్రోశ్ దివస్‌లో భాగంగా, విజయవాడలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రఘువీరాతో పాటు, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణమని, ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Congress President Raghuveera Reddy on Monday fired at TDP leader and Union Minister Sujana Chowdary.
Please Wait while comments are loading...