'సీఎం పేషీలో పైళ్లన్నీ లోకేష్ కనుసన్నల్లోనే', అమరావతిపై కానిస్టేబుల్ మమకారం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలోని పైళ్లన్నీ ఆయన కుమారుడు నారా లోకేష్ కనుసన్నల్లోనే కదులుతున్నాయని ఏపీసీసీ ఛీప్ రఘవీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పేషీలో ఇటీవల కాలంలో సీతాపతి అభీష్ట అనే వ్యక్తిని ఓఎస్డీగా నిబంధనలనలకు విరుద్ధంగా నియమించారని, దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు లేవని ఆయన అన్నారు. ఆ వ్యక్తి సీఎం కుమారుడైన నారా లోకష్‌కు స్నేహితుడు కావడమే అర్హత అని తెలిపారు.

దీంతో పాటు గతేడాది విశాఖపట్నంలో సంభవించిన హుదుద్ తుఫాను బాధితుల కోసం నగరంలో రెండు లక్షల మందికి రేషన్ కూపన్లు ఇస్తే, అవన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకే దక్కాయని ఆయన మండిపడ్డారు. వీటన్నింటికి ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతికి నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన కానిస్టేబుల్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై ప్రజాభిమానం నానాటికీ పెరిగిపోతోంది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఓ కానిస్టేబుల్ తన నెల వేతనాన్ని విరాళంగా అందజేశారు. మంగళవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన కానిస్టేబుల్ సాంబశివరావు తన నెల వేతనాన్ని అమరావతికి విరాళంగా అందజేశారు.
రాజధాని నిర్మాణానికి ఏకంగా నెల జీతాన్ని అందజేసిన సాంబశివరావును చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అంతక ముందు రాజధాని శంకుస్థాపన రోజున పుట్టిన పిల్లలకు అమరావతి అని పేరు పెట్టుకుంటే రూ.10 వేల బహుమతి అందజేస్తానని టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ప్రకటించారు.
ఆ తర్వాత తన ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులకు రూ.10 చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేసి తన హామీని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications