హోదా హక్కు, చట్టసభల్లో కార్పొరేట్ హవా: రఘువీరా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని ఏపి పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. గురువారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని రఘువీరా పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చట్ట సభల్లో కార్పొరేట్‌ హవా పెరిగిపోయిందని ఆరోపించారు.

ధనవంతులు, పారిశ్రామికవేత్తలకే పార్టీల అధినేతలు సీట్లు ఇస్తున్నారని విమర్శించారు. యువత రాజకీయాల్లోకి రావాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Raghuveera Reddy on Special status to AP

రెండు ఎన్‌కౌంటర్లూ బూటకమే: సిపిఎం

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లు రెండూ బూటకమే అని సిపిఎం జాతీయ నేత శ్రీనివాసరావు అన్నారు. పోలీసులే ప్రతీకారానికి దిగితే ప్రజాస్వామ్యానికి విలువ లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.

పోలీసులు ప్రధాన స్మగ్లర్లను వదిలేసి అమాయకులను చంపితే స్మగ్లింగ్ ఆగదని ఆయన అన్నారు. ఎర్రచందనం సొమ్మును చిత్తూరు, కడప జిల్లాల అభివృద్ధికి ఖర్చుపెడితే ఎర్రచందనాన్ని ప్రజలే కాపాడుకుంటారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+