విదేశీ కంపెనీలతో చంద్రబాబు వ్యాపారం: రఘువీరా

హైదరాబాద్/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ కంపెనీలతో వ్యాపారం చేస్తున్నారని, ఆ వాస్తవాలు బయటపడ్డ రోజు రైతులు చంద్రబాబును తప్పకుండా ప్రశ్నిస్తారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు.

వాస్తు పిచ్చితో చంద్రబాబు రైతులను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఏ రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాల భూమిని సేకరించలేదన్నారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీగా మారిందని ఎద్దేవా చేశారు. ఏటా ఐదు పంటలు పండే పొలాలు తీసుకునేందుకు చంద్రబాబు మనసెలా ఒప్పిందో అన్నారు.

22,500 ఎకరాలు సేకరించాం

Raghuveera Reddy says farmers will questions Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 22,500 ఎకరాల భూమిని సేకరించామని గుంటూరులో మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని కోసం భూమి ఇచ్చేందుకు చాలామంది రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతుల కోరిక మేరకు భూసమీకరణను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగిస్తున్నామన్నారు.

విద్యారంగంలో ఏపీని నెంబర్‌-1 చేస్తాం: గంటా

విద్యారంగంలో ఏపీని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. విశాఖపట్నంలో ఆదివారం ఉదయం ఆయన శ్రీకృష్ణ విద్యామందిర్‌లో నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరిలో విద్యపై అవగాహన కల్పిస్తామన్నారు. ఏపీని విద్యారంగంలో మేటిగా తీర్చిదిద్దుతామని, ఆదర్శ రాష్ట్రంగా మారుస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+