హోదాపై నాటకాలా?: సుబ్బరామిరెడ్డి, బాబుపై రఘువీరా ఘాటు వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటుసభ్యుడు టి సుబ్బరామిరెడ్డి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీ నాట‌కాలాడుతున్నాయని మండిపడ్డారు.

ఏపీకి హోదా వ‌చ్చే వ‌ర‌కు త‌మ‌ పోరాటం ఆగ‌దని సుబ్బరామిరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని అన్నారు.

ప్రభుత్వ పెద్దలు.. ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చి ఏపీకి అన్యాయం చేస్తున్నారని, ప్ర‌జ‌లను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేస్తారు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ఎటువంటి న్యాయం జ‌ర‌గ‌డం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేవీపీ ప్రైవేటు బిల్లుకి అన్ని రాష్ట్రాలు మ‌ద్ద‌తు ఇచ్చాయని సుబ్బరామిరెడ్డి తెలిపారు.

raghuveera reddy and subbarami reddy on AP special status

జ‌పాన్ నుంచి చీపుర్లు తెప్పించాం: ర‌ఘువీరా

ప్ర‌త్యేక హోదాని డిమాండ్ చేస్తూ మంగళవారం చేసిన రాష్ట్ర‌బంద్ విజ‌య‌వంత‌మైందని ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ... బంద్ ద్వారా ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. టీడీపీ, బీజేపీ నేత‌లు కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లు పాస్ అయ్యే విధంగా బాధ్య‌త‌ను తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా అంశంలో రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. ఆయ‌న‌కు చేత‌కాక‌పోతే సీఎం కుర్చి నుంచి త‌ప్పుకోవాల‌ని సంచలన వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం హోదా అంశాన్ని డైవ‌ర్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ర‌ఘువీరా ఆరోపించారు.

సీఎం చంద్ర‌బాబు, కేంద్ర‌మంత్రులు సుజ‌నా చౌద‌రి, అశోక్ గ‌జ‌ప‌తిరాజు, వెంక‌య్య నాయుడి ఇంటి ముందు బుధవారం త‌మ పార్టీ నిర‌స‌నలు చేప‌డుతున్న‌ట్లు రఘువీరా పేర్కొన్నారు. వారి ఇంటి ముందు రోడ్లు శుభ్రం చేస్తున్న‌ట్లు తెలిపారు. దాని కోసం ప్రత్యేకంగా జ‌పాన్ నుంచి చీపుర్లు తెప్పించామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

కేంద్రం నుంచి ఎటువంటి హామీ రాకున్నా.. టీడీపీ ఉదాసీన వైఖ‌రి అవ‌లంబిస్తోందని మండిపడ్డారు. టీడీపీ సొంత ప్ర‌యోజ‌నాల కోస‌మే ప్ర‌యత్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Congress leaders raghuveera reddy and subbarami reddy responded on Andhra Pradesh's special status issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి