ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్నారనే: బాలకృష్ణ ఆ సీట్లో కూర్చోవడం వెనుక! 'పవన్‌పై చెప్పు సరికాదు'
కర్నూలు/అనంతపురం: విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ.. సీఎం సీటులో కూర్చొని సమీక్ష నిర్వహించారని వచ్చిన వార్తలపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. బాలకృష్ణ తన మోజు తీర్చుకున్నారని ఎద్దేవా చేశారు.
Recommended Video

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కుర్చీని చంద్రబాబు లాక్కున్నారని బాలకృష్ణ మనసులో ఉండి ఉండవచ్చునని, అందుకే చంద్రబాబు లేని సమయంలో ఆ కుర్చీలో కూర్చున్నారని విమర్శించారు.

మోజు తీర్చుకున్న బాలకృష్ణ
ముఖ్యమంత్రి చంద్రబాబు సీట్లు కూర్చొని బాలకృష్ణ తన మోజు తీర్చుకున్నారని రఘువీరా అన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా విమర్శలు గుప్పించారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు విదేశీ పర్యటన అందుకే
దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని రఘువీరా ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గవర్నర్ నరసింహన్ గౌరవించడం లేదని విమర్శించారు. ఇద్దరు ముఖ్యమంత్రులను పొగడటమే పనిగా పెట్టుకున్నారన్నారు.

గవర్నర్‌కు ఇరు రాష్ట్రాలు సమానం
చంద్రబాబు హయాంలో గిరిజనులు, దళితులు, మహిళలపై దాడులు అధికమయ్యాయని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాలను పక్షపాతం లేకుండా చూసే బాధ్యత గవర్నర్‌కు ఉందని రఘువీరా చెప్పారు.

పవన్ పైకి చెప్పు సరికాదు
మరోవైపు, పవన్ కళ్యాణ్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఖమ్మంలో చెప్పు విసిరిన అంశంపై టీడీపీ రాజ్యసభ నేత టీజీ వెంకటేష్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరిగే హక్కు ఉందన్నారు. చెప్పి విసిరిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పవ్న పైకి చెప్పు విసరడం మంచి పద్ధతి కాదన్నారు.












Click it and Unblock the Notifications