హోదాపై ఎక్కడికైనా, జగన్ ఇక మాట్లాడు: రాహుల్, విభజనపై హాట్ కామెంట్స్

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాను ఎక్కడైనా పోరాడుతానని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం నాడు అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

చంద్రబాబు, జగన్‌లు ఇప్పటికైనా హోదా గురించి మాట్లాడాలని ప్రశ్నించారు. ఆయన పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు. దీని కోసం తాము ఎక్కడైనా పోరాడుతామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు. విభజన విషయమై మాట్లాడుతూ.. అన్ని పార్టీల ఏకగ్రీవంతో విభజన జరిగిందని చెప్పారు. చివరి సమయంలో కొన్ని పార్టీలు మాటను మార్చాయని టిడిపిని ఉద్దేశించి అన్నారు.

Rahul Gandhi hits out at Modi government and AP government

డిఎస్, బొత్సలపై ఆగ్రహం, ఆవేదన

డి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణల గురించి ఆయన మాట్లాడినప్పుడు కొంత బాధ కనిపించింది. వారిద్దరు అవకాశవాదులు అని మండపడ్డారు. అందుకే పార్టీ మారారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పైన పోరాడాలని, మీకు అధిష్టానం అండగా ఉంటుందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వ్యాపం కేసులో 40 మంది చనిపోయారని, అది ఏమైనా చిన్న విషయమా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+