వైఎస్సార్ వారసత్వం వారిదే - రాహుల్ కీలక వ్యాఖ్యలు..!!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ వీడియో రిలీజ్ చేశారు. అసలైన ప్రజా నాయకుడు వైఎస్‌ఆర్ అంటూ కొనియాడారు. ప్రజలకోసమే వైఎస్ పని చేశారని తెలిపారు. వైఎస్సార్ మరణం అత్యంత విషాదమని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరేలా ఉండేదని తెలిపారు. ఏపీకి కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కాదన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే తాను జోడో యాత్ర చేశానని చెప్పుకొచ్చారు.
ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడని..ఆయన మరణం అత్యంత విషాదకరమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వైఎస్సార్ ఏపీ భవిష్యత్ కోసం ఎండ, వానను లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని వైఎస్ షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తోందన్న నమ్మకం తనకుందని చెప్పారు. వైఎస్‌లో ఉన్న తెగువ, క్రమశిక్షణ, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు వైఎస్ షర్మిలో కనిపిస్తున్నాయన్నారు. తాను వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.

వైయస్ వారసురాలు షర్మిల - రాహుల్ గాంధీ.#RahulGandhi #APCongress #YSSharmila #YSVijayamma #YSJagan #YSRJayanthi #AndhraPradesh #Idupulapaya #Oneindiatelugu pic.twitter.com/HoWfeEVU4g
— oneindiatelugu (@oneindiatelugu) July 8, 2024
ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్, షర్మిల వేర్వేరుగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట వద్ద నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్దనల్లో పాల్గొన్నారు. ఘాట్ వద్ద విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సాయంత్రం మంగళగిరిలో షర్మిల తన తండ్రి జన్మదినం వేళ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications