రైలు ప్రమాదం: 18కి చేరిన మృతులు, రోదన (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారి మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైష్ణవి(11) మంగళవారం ఉదయం 5.30గంటలకు తుది శ్వాస విడిచింది. దీంతో మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది.
ఆరో తరగతి చదువుతున్న వైష్ణవి స్వస్థలం మెదక్ జిల్లా ఇస్లాంపూర్. వైష్ణవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. గత ఆరు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైష్ణమృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ప్రశాంత్, వరుణ్ గౌడ్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నితూష, శరత్‌ల పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మిగిలిన 14మంది చిన్నారులు కోలుకుంటున్నారు.
కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తరుణ్ (7) సోమవారం మృతి చెందాడు. తరుణ్‌ది మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి. తండ్రి శ్రీశైలం, తల్లి బాలమణి. తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి తరుణ్ శరీరం వైద్యానికి సహకరించలేదు.
సోమవారం సాయంత్రం 6.37 గంటలకు చిన్నారి తరుణ్ మృతి చెందినట్టు యశోద వైద్యులు ప్రకటించారు. తరుణ్ మృతితో యశోద ఆసుపత్రి ప్రాంగణం కుటుంబీకుల రోదనలతో శోకసంద్రంగా మారింది. చిన్నారి తల్లిదండ్రులను ఆక్రందనలు అందర్నీ కదిలించాయి. పోస్టుమార్టం నిమిత్తం తరుణ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రోదనలు
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తరుణ్ (7) సోమవారం మృతి చెందాడు.

తరుణ్ మృతదేహం
తరుణ్‌ది మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి. తండ్రి శ్రీశైలం, తల్లి బాలమణి.

కుటుంబసభ్యుల రోదనలు
తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి తరుణ్ శరీరం వైద్యానికి సహకరించలేదు.

తరుణ్ మృతదేహం
సోమవారం సాయంత్రం 6.37 గంటలకు చిన్నారి తరుణ్ మృతి చెందినట్టు యశోద వైద్యులు ప్రకటించారు.

కుటుంబసభ్యుల రోదనలు
తరుణ్ మృతితో యశోద ఆసుపత్రి ప్రాంగణం కుటుంబీకుల రోదనలతో శోకసంద్రంగా మారింది.

కుటుంబసభ్యుల రోదనలు
చిన్నారి తల్లిదండ్రులను ఆక్రందనలు అందర్నీ కదిలించాయి. పోస్టుమార్టం నిమిత్తం తరుణ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications