20,21న ఈ పలు రైళ్లు రద్దు - రీ షెడ్యూల్, ఆలస్యం..!!

సికింద్రాబాద్ డివిజన్ లో ఈ నెల 20, 21 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఘట్ కేసర్ - చర్లపల్లి స్టేషన్ల మధ్య ఆర్ యూ బీ పనుల కారణంగా ఈ నెల 20, 21న నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్నింటిని రీ షెడ్యూల్ చేశారు. చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో మే 21 న 17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 20, 21న కొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.

రెండు వైపుల పల్నాడు, గోల్కొండ ఎక్స్ ప్రెస్ లు, సికింద్రాబాద్ - రేపల్లె ఎక్స్ ప్రెస్, కాచిగూడ- మిర్యాలగూడ, మిర్యాలగూడ- నడికూడి, నడికూడి - మిర్యాలగూడ, మిర్యాలగూడ - కాచిగూడ ప్రత్యేక రైలు, సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూర్ ఖాగజ్‌నగర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అదే విధంగా మే 20, 21 తేదీల్లో నడపాల్సిన హౌరా - సికింద్రాబాద్, త్రివేంద్రం - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - మన్మాడ్ సహా ఐదు రైళ్లు ఆలస్యంగా నడవడానికి రీషెడ్యూల్ చేసారు.

train

12703 తిరువనంతపురం సెంట్రల్ -సికింద్రాబాద్ శబరి ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 20న రెండు గంటలు ఆలస్యంగా నడవనుంది. 12703 హౌరా - సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ని ఈ నెల 20న మూడు గంటలు ఆలస్యంగా నడవనుంది. విశాఖపట్నం-కాచిగూడల మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు(నం.12862/12861)ను రైల్వేశాఖ మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించింది. ఈ నిర్ణయం మే 20 నుంచి అమలులోకి వస్తుంది. కాచిగూడ తర్వాత ఈ రైలు శంషాబాద్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్‌కు పొడిగిస్తూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

రైలు 12861 విశాఖపట్నంలో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఇది కాచిగూడలో ఉదయం 6:55 గంటలకు బయలుదేరి 9:20 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. రైలు 12862 మహబూబ్‌నగర్ నుండి సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి 6:10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది, కాచిగూడ నుండి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు 12862 మహబూబ్‌నగర్ నుండి సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి 6:10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది, కాచిగూడ నుండి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+