తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఇకపై..

తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు శుభవార్త అందించారు. రైళ్ల రాకపోకలను మరింత మెరుగుపర్చే దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుపతి- రామేశ్వరం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ ఫ్రీక్వెన్సీని పెంచారు. అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన తిరుపతి రూట్ లో వేలాదిమంది భక్తులు, ఇతర ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో ఈ తాజా చర్యలు తీసుకున్నారు.

తిరుపతి- రామేశ్వరం మధ్య నడిచే మీనాక్షి ఎక్స్ ప్రెస్ ఇకపై వారంలో నాలుగు రోజుల పాటు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మూడు రోజుల పాటు మాత్రమే రాకపోకలు సాగిస్తూ వస్తోంది. చాలాకాలంగా ఉన్న డిమాండ్ ఇది. తమిళనాడు చిట్టచివరి ప్రాంతం నుంచీ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి నేరుగా రైలు కనెక్టివిటీ కల్పించే ఎక్స్ ప్రెస్ ఇది. ప్రయాణికుల నుంచి అంచనాలకు మించిన ఆదరణ ఉండే రైలు ఇది.

Railway Authorities Increased the Rameswaram- Tirupati Express as runs 4 days a week From March 3

దీని ఫ్రీక్వెన్సీని పెంచాలని, వారంలో నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల నుండి పలు విజ్ఞప్తులు అందాయి. వీటిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై తాజాగా రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 3వ తేదీ నుంచి ఈ ఎక్స్ ప్రెస్ వారంలో నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

నంబర్ 16780 రామేశ్వరం - తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం గురు, శుక్ర, ఆదివారాల్లో నడుస్తోంది. కొత్తగా మంగళవారం కూడా తోడైంది. మార్చి 3 నుంచి ప్రతి మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా నంబర్ 16779 తిరుపతి - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మార్చి 4 నుండి సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తుంది. ప్రస్తుతం సోమ, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటోంది. కొత్తగా బుధవారం వచ్చి చేరింది.

మార్చి 3 నుంచి ప్రతి మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 4:55 నిమిషాలకు రామేశ్వరం నుండి బయలుదేరే నంబర్ 16780 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.

మార్చి 3 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 11:55 నిమిషాలకు తిరుపతి నుండి బయలుదేరే నంబర్ 16779 ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు తెల్లవారు జామున 4:35 నిమిషాలకు రామేశ్వరానికి చేరుకుంటుంది.

మండపం, రామనాథపురం, పరమక్కుడి, మనమధురై, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, సర్కాజీ, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, తిరువణ్ణామలై, పోలూర్, ఆరణి రోడ్, వేలూరు కంటోన్మెంట్, కాట్పాడి, పాకాల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+