విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ సెలవు మార్పు, ఇక నుంచి..!!
రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన తొలి వందే భారత్ రైలు నిర్వహణలో తాజా మార్పులు చేసారు. ప్రారంభం నుంచి ఈ రైలుకు మంచి స్పందన కనిపిస్తోంది. రైల్వే అంచనాలకు తగినట్లుగా ఆక్యుపెన్సీ రేషియో కొనసాగుతోంది. అయితే, ఈ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తుందనే ఫిర్యాదులు ఉన్నాయి. అదే విధంగా వారంలో ఒక రోజు ఈ రైలు మెయిన్ టెయినెన్స్ కోసం విశ్రాంతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతీ ఆదివారం ఈ రైలు అందుబాటులో ఉండటం లేదు. ఇప్పుడు ఇందులో మార్పు చేస్తూ ప్రకటన చేసారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలు నిర్వహణలో మార్పు జరిగింది. విశాఖ - సికింద్రాబాద్ (20883/20884) కు ప్రయాణీకుల నుంచి ప్రారంభం అయిన సమయం నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ప్రతీ రోజు ఉదయం విశాఖలో 5.45 గంటలకు బయల్దేరి సామర్లకోట, రాజ మండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్ల మీదుగా మధ్నాహ్నం 2.15 గంటలకు సికింద్రా బాద్ చేరుతుంది.

అదే విధంగా మధ్నాహ్నం 3 గంటలకు తిరిగి బయల్దేరి ఇవే స్టేషన్ల మీదుగా రాత్రి 11.35 గంటలకు విశాఖ చేరుతోంది. ఈ వందేభారత్ కు ప్రతీ వారం మెయిన్ టెయినెన్స్ కోసం ఆదివారం రైలు నడపటం లేదు. కానీ, ప్రయాణీకుల నుంచి ఆదివారం తమకు ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొస్తే మరింత ప్రయోజ నకరంగా ఉంటుందనే అభ్యర్ధనలు వచ్చాయి. దీని ద్వారా కుటుంబాలతో ప్రయాణాలకు వెసులు బాటు కలుగుతుందని వినతులు రావటంతో రైల్వే అధికారులు ఈ దిశగా రైల్వే బోర్డుకు సమస్య నివేదించారు.
రైల్వే శాఖ ఉన్నతాధికారుల అనుమతితో తాజాగా ప్రతీ ఆదివారం కూడా విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ నడుస్తుందని ప్రకటించారు. ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇక నుంచి విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ మంగళవారం ఈ సర్వీసుకు విరామం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండానే ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications