Arava Sreedhar డమ్మీ క్యాండెట్.. నా సేఫ్టీ కోసమే వీడియోలు రికార్డ్ చేశా
రైల్వేకోడూరు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కిస్తున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఒక వైపు విచారణ కమిటీ, మరో వైపు వీడియోల విడుదల... ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం వ్యక్తిగత ఆరోపణల స్థాయిని దాటి రాజకీయంగా తీవ్ర దుమారం రేపే దిశగా సాగుతోంది. బాధితురాలు వరుసగా వీడియోలు విడుదల చేస్తూ టెన్షన్ పెంచుతుండగా, ఎమ్మెల్యే ఇచ్చిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి.
నిన్న విచారణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్, తనకు మరియు బాధితురాలికి మధ్య జరిగినది పూర్తిగా వ్యక్తిగత అంశమేనని వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలపై స్పందించేందుకు బాధిత మహిళ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

మీడియాతో మాట్లాడిన బాధితురాలు, తనకు సంబంధించిన మరికొన్ని కీలక వీడియోలను త్వరలోనే విడుదల చేస్తానని ప్రకటించారు. గతంలో తనపై వచ్చిన "18 నెలల్లో పలుమార్లు అబార్షన్ చేయించుకుంది" అన్న ప్రచారంపై ఆమె మరోసారి స్పష్టత ఇచ్చారు. తనకు అబార్షన్ జరగలేదని, 'అబార్ట్' అయిన విషయాన్ని మాత్రమే తాను చెప్పినట్లు తెలిపారు. ఈ అంశాన్ని కావాలని వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
మరో ఆరుగురు మహిళలతో వివాహేతర సంబంధాలు..
అదే సమయంలో, 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశానన్న ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించారు. బయట వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తున్న వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎమ్మెల్యే శ్రీధర్ తనతోనే కాకుండా మరో ఆరుగురు మహిళలతో కూడా వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారని, వాటికి సంబంధించిన వివరాలు తనకు తెలిసిన తర్వాతే తనపై ఈ తరహా చర్యలు మొదలయ్యాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీధర్‌ను బెదిరించాలంటే..
అసెంబ్లీ నుంచే శ్రీధర్ తనకు వీడియో కాల్ చేశారని, తన దగ్గర ఉన్న స్క్రీన్ రికార్డింగ్స్ అన్నీ ఆయనకు తెలుసని బాధితురాలు చెప్పారు. ఇవన్నీ బెదిరింపుల కోసం కాదు, తన భద్రత కోసమే రికార్డ్ చేశానని వెల్లడించారు. "నేను శ్రీధర్‌ను బెదిరించాలంటే ఒక్క ప్రెగ్నెన్సీ చాలు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ డమ్మీ క్యాండెట్.. అది రైల్వే కోడూరులో ఉన్న ఎవ్వరికైనా తెలుసు, అరవ శ్రీధర్ వేరే వాళ్లతో ఉన్నట్లు నేను ప్రూవ్ చేయగలను.. నేను వేరే వాళ్ళతో ఉన్నట్లు ఆయన ప్రూవ్ చేయగలడా ? అరవ శ్రీధర్ కుటుంబసభ్యులకు కూడా మా పెళ్లి సంగతి తెలుసు. విడిపోయింది అతను...ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఆయనే రీజన్ చెప్పాలి. - బాధితురాలు
ఈ మీడియా సమావేశంలో ముందుగా బాధితురాలి న్యాయవాది మాట్లాడారు. తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సహకారంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కీలక అంశాలు త్వరలోనే బయటపడతాయని సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుందని, ఆ రోజు తర్వాత మరిన్ని విషయాలు ప్రజల ముందుకు వస్తాయని చెప్పారు.
మొత్తంగా చూస్తే, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కేసు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల నుంచి రాజకీయ అగ్నిపర్వతంగా మారుతోంది. ఒక వైపు వీడియోల బెదిరింపు ఆరోపణలు, మరో వైపు కోర్టు విచారణ... రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం జనసేనతో పాటు ఏపీ రాజకీయాలను ఎంతవరకు కుదిపేస్తుందో అన్నది ఇప్పుడు హాట్ క్యూరియాసిటీగా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications