railway news: రైల్వే ప్రయాణికులంతా అలర్ట్ గా ఉండాలి..
తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే పొడిగించింది.
రైల్వే ప్రయాణికులంతా అప్రమత్తంగా ఉండాల్సిన వార్తను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ఒక శుభవార్తను చెప్పడంతోపాటు తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ఇప్పటివరకు నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే పొడిగించింది. అలాగే రద్దీ దృష్ట్యా ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.
పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Train No.07489: సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలును ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. Train No.07490: తిరుపతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలును ఈ నెల 19, 26 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలుకు గతంలో ఏవిధంగా స్టాప్స్ ఉన్నాయో, సమయ వేళలున్నాయో అవే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ రెండు రైళ్లు కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
Train No.03226: సికింద్రాబాద్-ధన్ పూర్ ప్రత్యేక రైలును ఈ నెల 19, 26 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించారు. ఈ రైలు ఉదయం 10.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 19.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. Train No.03225: ధన్ పూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలును ఈ నెల 16, 23 తేదీల్లో నడపనున్నారు. ధన్ పూర్ లో రాత్రి 20.50 గంటలకు బయలుదేరి, తర్వాతరోజు సాయంత్రం 4.40 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా, నాగపూర్, జబల్ పూర్, మణిక్ పూర్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications