railway news: విజయవాడ రైల్వే జంక్షన్లో దీపావళి పండుగ రష్... రైల్వే కీలక చర్యలు!

దీపావళి పండుగకు దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దీపావళి పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్లలో జనాలు కిటకిటలాడటంతో తొక్కిసలాట చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. విజయవాడలో పండుగ సందర్భంగా రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌లో ప్రజలు క్యూలో నిరీక్షించేందుకు వీలుగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

దీపావళి రద్దీ నియంత్రణకు విజయవాడ రైల్వే జంక్షన్ లో చర్యలు
ప్రతి ఒక్కరూ తోసుకోకుండా, తొక్కిసలాట లేకుండా క్యూ లైన్లలో వెళ్ళేలా చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్స్ నుండి, రైలు ఎక్కే వరకు అందరూ క్యూ లైన్లలో వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకులకు సహాయం చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చేశారు. రైల్వే స్టేషన్‌లోని అన్ని ప్లాట్ ఫాం లలో నడవలేని వారి కోసం వీల్‌చైర్‌ లను ఏర్పాటు చేశారు.

railway news Diwali festival rush at Vijayawada railway junction important measures of railway

ఏపీలో ముఖ్యమైన రైల్వే జంక్షన్ విజయవాడ
ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎలివేటర్‌లు, ర్యాంప్‌లు వంటి సదుపాయాల కల్పన కూడా ప్రయాణీకుల సౌకర్యార్ధం చేశారు. విజయవాడ రైల్వే జంక్షన్ భారతదేశంలో ముఖ్యమైన రైల్వే జంక్షన్. సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ తర్వాత తర్వాత NSG-1 హోదా సాధించిన రెండవ రైల్వే జంక్షన్ ఇది. భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాలను అనుసంధానించే రైల్వే జంక్షన్ విజయవాడ రైల్వే జంక్షన్.

క్యూ లైన్లు, స్పెషల్ టీమ్స్ తో బెజవాడ రైల్వే జంక్షన్
ఈ రైల్వే జంక్షన్లో పండుగల సమయంలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో క్యూ లైన్లను ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించటంతో పాటు టికెట్ లేకుండా రైలులో ప్రయాణించకుండా నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టిక్కెట్‌ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాన్ని హాయిగా ఆస్వాదించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

రైలు ఎక్కాలన్నా క్యూ పాటించాల్సిందే
దీపావళి సెలవుల సీజన్‌లో, విజయవాడ నుండి ప్రయాణించాలనుకునేవారి కోసం విజయవాడ నుండి 40 ప్రత్యేకరైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ బోగీల్లోకి వెళ్లేందుకు క్యూలోనే వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రైలు వద్ద ఆర్‌పిఎఫ్‌ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

అదనపు కౌంటర్లు, స్పెషల్ హెల్ప్ డెస్క్ లు
రద్దీతో ప్రయాణికులు తమ టికెట్లను పొందేందుకు టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి అదనపు టిక్కెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అదనంగా, ఈ స్టేషన్లలో టిక్కెట్లను తనిఖీ చేయడానికి మరియు ప్రయాణికులకు సహాయం చేయడానికి సిబ్బందితో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి దీపావళి పండుగ రద్దీని కంట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి తొక్కిసలాటలు, అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+