విశాఖ నుంచి హైదరాబాద్, తిరుపతి వెళ్లే ప్రధాన రైళ్లు ఈ తేదీల్లో రద్దు..!!
రైల్వే అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. విశాఖ నుంచి తిరుపతి, లింగంపల్లి వెళ్లే వాటితో సహా పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రైళ్ల వివరాలు.. రద్దు చేస్తున్న తేదీలను వెల్లడించారు. రైల్వే ఆధునీకరణ పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు ప్రయాణీకులు ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. అయితే, విశాఖ నుంచి నిత్యం రద్దీగా ఉండే రైళ్లు సైతం ఈ రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 27న తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ (17480), 28న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ (22708); 28, 29 తేదీల్లో విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805), మచిలిపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ (17219); 29న విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707), 29, 30 తేదీల్లో లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806), విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220), 28, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) రద్దు చేసారు.

కాగా. 29, 31 తేదీల్లో విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718), విశాఖ పట్నం-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240), రాజమండ్రి-విశాఖ మెము పాసింజర్ (67285), విశాఖ-రాజమండ్రి మెము పాసింజర్ (67286), జనవరి 31న గుంటూరు-విశాఖ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22876), విశాఖ-గుంటూరు డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22575) రద్దు కానున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ మార్పులకు అనుగుణంగా ప్రయాణాలు ఖరారు చేసుకోవాలని సూచించారు. విశాఖ నుంచి నిత్యం రద్దీగా ఉండే రైళ్లు కావటంతో ప్రయాణీకులకు సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications