శాతవాహన, గోల్కొండ, గౌతమి ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ - కీలక మార్పులు..!!
రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వే యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో మరి కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేయగా.. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇక.. వేసవి రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రైళ్ల షెడ్యూల్ ను ప్రకటించారు.
విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వే యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్ల పైన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మరో 10 రైళ్లను దారిమళ్లించడంతో పాటు 2 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు వివరించారు. రద్దు.. మార్పులు చేసిన వాటిల్లో సికింద్రాబాద్-విజయవాడ- (శాతవాహన), గుంటూరు-సికింద్రాబాద్ (గోల్కొండ), విజయవాడ- భద్రాచలం (మెమో), విజయవాడ-డోర్నకల్ (మోమో), విశాఖపట్నం-మహబూబ్‌నగర్ (విశాఖ), కాకినాడ-లింగంపల్లి (గౌతమి), సంబల్‌పూర్-నాందేడ్ (నాగావళి), నాందేడ్-విశాఖపట్నం- సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయని తెలిపారు. కాగా, వేసవి రద్దీకి అనుగుణంగా రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

వేసవికి ప్రత్యేక రైళ్లు... సర్వీసులు పొడిగింపు
రైలు నెం: 06557 (ఎస్ఎంవీటీ బెంగళూరు- సంత్రాగాచి.. ఏప్రిల్ 10 నుంచి 24 వరకు శుక్రవారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది. రైలు నెం: 06558 (శాంత్రగాచి- బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్ 12 నుంచి 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది. రైలు నెం: 06207 (బెంగళూరు కంటోన్మెంట్- కలబురగి) ఏప్రిల్ 11 నుంచి 25 వరకు శనివారాల్లో (3 సర్వీసులు) నడవనుంది. కాగా.. రైలు నెం: 06208 (కలబురగి- బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్12 నుంచి 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది. అదే విధంగా రైలు నెం: 06539 (ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు.. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు శుక్ర, ఆదివారాల్లో (6 సర్వీసులు) నడుస్తుంది. ఇక.. రైలు నెం: 06540 (బీదర్- ఎస్‌ఎంవీటి బెంగళూరు) ఏప్రిల్ 11 నుంచి 13 వరకు.. ఏప్రిల్ 16 నుంచి 27 వరకు శనివారాలు, సోమవారాల్లో (6 సర్వీసులు) నడుస్తుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications